
– రాజగోపాల్ రెడ్డి మాయమాటలు నమ్మి మోసపోతే గోసపడతారు..
– బీఆర్ఎస్ మునుగోడు నియోజకవర్గ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి..
నవతెలంగాణ- మునుగోడు: మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని లక్ష్యంతో ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు మరోసారి అవకాశం ఇస్తే ప్రాజెక్టులను పూర్తి చేసి నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు తాగునీరు అందించి నియోజవర్గంలోని ప్రజల కాళ్లు కడిగి రుణం తీర్చుకుంటానని మునుగోడు నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రాధేయబడ్డారు. సోమవారం మండలంలోని కోతులారం , కల్వకుంట్ల చల్మెడ, కొంపెల్లి, చీకటిమామిడి, కచలాపురం, రావి గూడెం, జక్కల వారి గూడెం, సోలిపురం, తదితర గ్రామాలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చేయమని నియోజవర్గ ప్రజలు 2018లో గెలిపిస్తే 18 వేల కోట్ల కాంట్రాక్టుకు బిజెపికి అమ్ముడుపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి గెలిపించమని ప్రజలు మోసం చేసేందుకు డబ్బుల సంచులతో వస్తున్నాడని మాయమాటలు నమ్మి మోసపోతే మళ్ళీ గోసపడతారని అన్నారు .24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రోజు ఎట్లా సాధ్యమవుతుందని ఎగతాళి చేసిన కాంగ్రెస్ కు ఎట్లా సాధ్యం కాదోనని పట్టుతో తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిది సంవత్సరాలుగా 24 గంటల నాణ్యమైన కరెంటు అందిస్తున్న బీఆర్ఎస్ కావాలనా.. మూడు గంటల కరెంటు చాలు అంటున్న కాంగ్రెస్ కావాలని ప్రజలే తెచ్చుకోవాలని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలు కొనసాగాలంటే బీఆర్ఎస్ తోనే సాధ్యమని ముఖ్యమంత్రిగా కేసీఆర్ నీ గెలిపించుకోవాలని అన్నారు. ఇటీవల మునుగోడు నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి యామిని నెరవేర్చేందుకు 560 కోట్ల నిధులు మంజూరు చేసిందని పేర్కొన్నారు. మునుగోడు అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమని ఉప ఎన్నికల ఇచ్చిన హామీలన్నీ నియోజకవర్గంలో దాదాపుగా నెరవేరాయని మునుగోడు అభివృద్ధిలో దూసుకుపోతుందని ఈ అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ కు అండగా నిలవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు బండ పురుషోత్తం రెడ్డి, పగిళ్ల సతీష్ కుమార్, కోతులారం సర్పంచ్ జాజుల పారిజాత సత్యనారాయణ గౌడ్ , మాధగోని పరమేష్, డోకూరు వేణు, అయితగోని విజయ్, బోయపర్తిసురేందర్, ఏరుకొండ శీను, సైదులు , ప్రణయ్ , వెంకన్న తదితరులు పాల్గొన్నారు.