ఆరోగ్య సిబ్బంది సమయపాలన పాటించాలి

– డిప్యూటీ డీఎం అండ్‌ హెచ్‌ఓ విజయలక్ష్మి
నవతెలంగాణ-షాద్‌నగర్‌
ఆరోగ్య సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని డిప్యూటీ డీఎం అండ్‌ హెచ్‌ఓ విజయలక్ష్మి అన్నారు. షాద్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలోని కొందుర్గు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సోమవారం తనిఖీ చేశారు. ఆరోగ్య సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ గర్భిణులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. ప్రభుత్వా స్పత్రిలో డెలివరీలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రయివేట్‌ ఆస్పత్రు లను ప్రోత్సహించకూడదని దిశా నిర్దేశం చేశారు. గర్భవతులను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. ఆస్పత్రిలో పేషంట్లకు కావాల్సిన అన్ని రకాల మందులను అందుబాటులో పెట్టుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ అమత జోసఫ్‌, డాక్టర్‌ తబసుమ్‌ మహారాజ్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ జె. శ్రీనివాసులు, సీహెచ్‌వో పద్మ, డీపీఎంవో వెంకటేశ్వర్లు, పీహెచ్‌ఎన్‌ లుదియా, ఎంపీహెచ్‌వో వినోద్‌, హెల్త్‌ సూపర్‌వైజర్‌ మెర్లిన్‌, ఫార్మసిస్ట్‌ గోపాలకృష్ణ, ల్యాబ్‌ టెక్నీషియన్‌ పరమేష్‌ పాల్గొన్నారు.

Spread the love