చైనాలో భీక‌ర వర్షం..11మంది మృతి

నవతెలంగాణ- చైనా: చైనాలో భీక‌ర వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజ‌ధాని బీజింగ్‌లో ఎడ‌తెరిపిలేకుండా వాన కురుస్తోంది. దీంతో ఆ న‌గ‌ర స‌మీప ప్రాంతాల‌న్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి. టైఫూన్ డొక్సూరి వ‌ల్ల‌ బీజింగ్ న‌గ‌రంలో కూడా లోత‌ట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ద‌శాబ్ధ కాలంలో రికార్డు స్థాయిలో వ‌ర్షాలు కురిసిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. ఉత్త‌ర చైనాలోని హీబై ప్రావిన్సు, తియాంజిన్ మున్సిపాల్టీల్లో వ‌ర‌ద ప‌రిస్థితి బీభ‌త్సంగా ఉంది. బీజింగ్ ప‌రిస‌ర ప్రాంతాల్లో వ‌ర‌ద‌ల వ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కు 11 మంది మ‌ర‌ణించారు. హిబైలోని జింగ్‌టాయిలో 1000 మిల్లీమీట‌ర్ల వ‌ర్షపాతం కురిసింది. ఈ వర్షం ఎక్కువ అని జాతీయ వాత‌వ‌ర‌ణ శాఖ తెలిపింది. ఆ ప్రాంతంలో ఏడాది మొత్తం 500 మిమీ మాత్ర‌మే కురుస్తుంద‌ని, కానీ ఒక్క‌సారే దానికి రెండు రేట్లు వ‌ర్షం కుర‌వ‌డం దారుణ‌మ‌ని వాతావ‌ర‌ణ శాఖ పేర్కొన్న‌ది.

Spread the love