ఢిల్లీలో భారీ వర్షం.. ఎయిర్ పోర్టులో కూలిన రూఫ్

నవతెలంగాణ – ఢిల్లీ: ఢిల్లీలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు..మొత్తం జలమయమయ్యాయి. దీంతో నిన్నటి నుంచి ఢిల్లీలో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మరో 2 రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 6 కార్లు, బైకులు…పలు ప్రాంతాల్లో నీట మునిగాయి. అటు ఢిల్లీ ఎయిర్ పోర్టులో కూలింది రూఫ్. ఇక ఆ ఎయిర్‌ పోర్టు రూఫ్ కూలడంతో కార్లు ధ్వంసం అయ్యాయి. ఈ సంఘటనలో ఆరుగురికి గాయాలు అయ్యాయి. దీంతో బాధితులను ఎయిర్‌పోర్టు మేదాంతకు తరలించారు. ఇక దీనిపై పోలీసులు కూడా రంగంలోకి దిగి చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love