పర్వత శిఖరాల నుండి భారీ మంచు

నవతెలంగాణ – కేదర్‌నాథ్‌: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ హిమాలయ పర్వత శిఖరాల నుండి భారీ ఎత్తున మంచు కిందకు కూలుతుండటంతో.. అక్కడి ప్రజల్లో ఆందోళన మొదలయ్యింది. ఆలయం వెనకవైపు నాలుగు కిలోమీటర్లదూరంలోని పర్వతం నుంచి ఒక్కసారిగా భారీ ఎత్తున మంచు విరిగిపడటం ప్రారంభమైంది. అక్కడి ప్రజలు ఒకింత భయపడుతూనే ఆ దఅశ్యాలను మొబైళ్లలో బంధించేందుకు పోటీపడ్డారు. మేరు-సుమేరు పర్వతశ్రేణుల్లోని చోరాబారీ హిమానీనదం పరిధిలో గాంధీ సరోవర్‌పై హిమపాతం పడింది. మంచంతా లోయలో పడిపోవడంతో కేదర్‌నాథ్‌ ఆలయం వరకు దూసుకురాలేదు. దీంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. దాదాపు ఐదు నిమిషాలపాటు గుట్టలకొద్దీ మంచు కిందకు పడుతున్న వీడియో వైరల్‌గా మారింది.

Spread the love