రూ. 6 కోట్ల విలువైన హెరాయిన్‌ స్వాధీనం

గువహటి : రూ.6 కోట్ల విలువైన హెరాయిన్‌ను అస్సాం పోలీస్‌కి చెందిన స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎస్‌టిఎఫ్‌) స్వాధీనం చేసుకుంది. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు శనివారం ప్రకటించింది. మణిపూర్‌లోని కాంగ్‌పోక్సీ నుండి అస్సాంలోని దిగువ జిల్లాలకు సరఫరా చేస్తున్న ఈ ముఠాను అదుపులోకి తీసుకున్నామని, డ్రగ్స్‌ ట్రాఫికింగ్‌ను చేధించినట్లు ఎస్‌టిఎఫ్‌ పేర్కొంది. శనివారం రాత్రి ముర్తాజా అహ్మద్‌ అలియాస్‌ భూలు టాటా నెక్సాన్‌లో ప్రయాణిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. తనిఖీ చేయగా 49 సబ్బు పెట్టెల్లో అక్రమంగా తరలిస్తున్న 637 గ్రాముల హెరాయిన్‌ను గుర్తించారు. వీటి విలువ రూ. 6 కోట్లు ఉంటుందని అంచనా. ముర్తాజా అహ్మద్‌ను అరెస్ట్‌ చేసిన అనంతరం డోక్మాకు చెందిన ప్రశాంత్‌ అనే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Spread the love