కేసీఆర్ పిటిష‌న్‌పై తీర్పును రిజ‌ర్వ్ చేసిన హైకోర్టు

నవతెలంగాణ – హైదరాబాద్: హైకోర్టులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై వాద‌న‌లు ముగిశాయి. విద్యుత్ క‌మిష‌న్ ఏర్పాటు జీవోను కొట్టివేయాల‌ని కేసీఆర్ పిటిష‌న్ దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే. అలాగే జ‌స్టిస్ ఎల్ న‌ర‌సింహారెడ్డి జారీ చేసిన నోటీసులు ర‌ద్దు చేయాల‌ని కేసీఆర్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. విద్యుత్ క‌మిష‌న్ చైర్మ‌న్ ఏక‌ప‌క్ష ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని ఏజీ పేర్కొన్నారు. కేసీఆర్ పిటిష‌న్‌కు విచార‌ణ అర్హ‌త ఉందా లేదా అనే దానిపై వాద‌న‌లు ముగిశాయి. అనంత‌రం కేసీఆర్ పిటిష‌న్‌పై తీర్పు రిజ‌ర్వ్ చేసిన‌ట్లు హైకోర్టు ప్ర‌క‌టించింది.

Spread the love