ఫినాయిల్‌కి మహాగిరాకీ..

‘సుక్కల్లోకెక్కినాడు సెందురూడు’ అంటూ ప్రధాన రాజకీయపార్టీలన్నీ ఇప్పుడు ప్రశాంతంగా ఓ సాంగేసు కుంటున్నాయి. ఓట్ల పండగ అయిపాయే…రిజల్ట్‌ వచ్చాక ఓడినా, గెలిచినా చేసేదేం లేదు. గెలిస్తే ఏం సెప్పాలే… ఓడితే ఏం సెప్పాలే అనే దానిపై పెద్దసార్లు ఫుల్‌క్లారిటీతో ఇప్పటికే ముస్తాబై ఉన్నారు. ఓట్ల కోసం నాలిక మడతపెట్టి ఒకర్నొకరు తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టుకొని, ఇప్పుడు ఏం జరగనట్టు సైలెంట్‌గా ఎలా ఉన్నారబ్బా! అనే డౌటను మానం సహజమే. దీన్నే ఓ దోస్తుగాని దగ్గరంటే …”ఓట్ల పండగ అయిన తెల్లారే ఆళ్లు ఫినాయిల్‌తో నోళ్లు కడిగేసుకున్నార్లే…నువ్వేం గుబులుపడకు బై” అని నొక్కివక్కాణించాడు. పైగా… ఇప్పుడాళ్లు సోంప్‌, ఇలాచీ, బెల్లం, పుదీనా కలిసి ‘మీనాక్షి’ పాన్‌ వేసుకొని మజాచేస్తు న్నార్లే…అని కూడా ముక్తాయింపు ఇచ్చాడు… నిజమేనంటారా?!!
– కెఎన్‌ హరి

Spread the love