మద్యం లొల్లి… కిక్కే కిక్కు…

అర్జీ… ఆబ్కారీ… ఆదాయం… రాజకీయం! గిదేందనుకుంటున్నారా? గదే మద్యం దరఖాస్తుల సంఖ్య గురించే. కొత్త లిక్కర్‌ షాపులకు అక్షరాల లచ్చపైనే అప్లీకేషన్లు వొచ్చాయి. కిక్కే… కిక్కే. కిక్కు మత్తెక్కిస్తుంది. గీ మత్తే మస్తు ఆదాయం తెచ్చిపెట్టింది. గీ ఆదాయంపై చేతి గుర్తు, కమలంపువ్వు గుర్తు పార్టీ లీడర్లు లొల్లి లొల్లి చేస్తుండ్రు. మూడునెలలకు ముందే దరఖాస్తులెందుకు స్వీకరిస్తున్నారని ఇమర్శలు చేస్తుండు. ఇగ రేవంతన్న ఏకంగా అధికారంలోకి రావడం ఖాయమని, మేం మల్లా అర్జీలు తీసుకుంటామని ప్రకటించడంతో అర్జీ పెట్టుకున్కొళ్లకు భయం పట్టుకుందంట! గిప్పటికే ఒకాయన ఏకంగా దరఖాస్తులకే రూ.20 కోట్లు పెట్టిండు. మల్లా దరఖాస్తులంటే ఏం సేయాలో సమజైతలేదంట! మద్యం లాటరీపై గిట్ల ప్రచారం జరుగుతున్నది. ఇంకో దిక్కు పువ్వు గుర్తు బండెన్న లిక్కర్‌ షాపుల టెండర్లపై ఎకసెకలాడుతుండు. తెలంగాణలో ఊరురా… బెల్టు షాపులు బెంబేలెత్తిస్తున్నవి. వయసు పొరలు తాగి ఆగమైతుండ్రు. ఎన్నో సంసారాలు సట్టుబండలతై మాట్లాడని గీ చేయిగుర్తు, పువ్వు గుర్తు లీడరన్నలు టెండర్లపై మాట్లాడుదేందోనంటూ రచ్చబండలకాడా ఉచ్చరిస్తుండ్రు! – నిరంజన్‌ కొప్పు

Spread the love