స్వయం సహాయక సంఘాల ఆర్ధిక బలోపేతానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి…

– శాఖల వారీగా పనులపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్…
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జీల్లా గ్రామీణాభివృద్ధి సంస్ధ ద్వారా జిల్లాలో చేపట్టే  పనులు , పథకాలు ప్రజల భాగస్వామ్యంతో జరగాలని అలాగే స్వయం సహాయక సంఘాల ఆర్థిక బలోపేతానికి అధికారులు, సిబ్బంది  నిరంతరం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. శుక్రవారం గ్రామీణాభివృద్ధి శాఖ, వ్యవసాయ శాఖ, జిల్లా పంచాయతీ శాఖ ద్వారా చేపట్టిన పనులు, పథకాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్  మాట్లాడుతూ డి‌ఆర్‌డి‌ఏ‌ఓ కార్యాలయ పరిధిలో పనిచేయుకున్న మండల, గ్రామ స్ధాయి సిబ్బంది పనులపై నిబద్ధతతో పనిచేయాలని అన్నారు.  ఈ‌జి‌ఎస్ (ఈజీఎస్) విభాగానికి సంబందించి అర్హత గల ప్రతి ఒక్కరికీ జాబ్ కార్డు అందించి  100 శాతం పనిదినాలు కల్పించి జిల్లాను ప్రగతి నివేదికను పెంచవలసినదిగా సూచించారు. మహిళా శక్తి లో ఉన్న అన్ని అంశాలకు సంబంధించి యాక్షన్ ప్లాన్ తయారు చేయవలసిందిగా డిఆర్డిఓ ను కలెక్టర్ ఆదేశించారు. ఎంటర్ప్రైజెస్ ,స్కూల్ యూనిఫామ్ మీసేవ కేంద్రాలు మొదలు అంశాలపై సంబంధిత జిల్లా అధికారులకు యాక్షన్ ప్లాన్ తయారు చేయవలసిందిగా ఆదేశించారు. ఫామ్ విభాగంలో ప్రతి గ్రామ పంచాయితీ పరిధిలో 5 యూనిట్ల చొప్పున గుర్తించాలని, పనుల నివేదికలను ఎప్పటికప్పుడు అందించాలని సూచించారు. యూనిట్ల కు సంబందించిన లేబర్ పేమెంట్ అస్సెంట్ (ఏ ఎస్ ఎస్ ఈ టి) జనరేషన్ నివేధికను సమర్పించాలని పేర్కొన్నారు. అదేవిదంగా జల శక్తి అభియాన్ కార్యక్రమం ద్వారా జల వనరులను జియో ట్యాగు ద్వారా గుర్తించాలని అన్నారు.
ప్లాన్టేషన్ సబందించి మండల, గ్రామ స్ధాయిలో పూర్తి స్ధాయి నివేదికను అందచేయాలని అన్నారు. అలాగే హైద్రాబాద్ మరియు విజవాడ హైవే లలో  రోడ్డు మధ్య లో విస్తరింపచేసి పెంచుకున్న మొక్కల యొక్క వివరాలను (బ్రతికి వున్న చని పోయిన మొక్కల వివరాలను) నివేధికను తయారు చేసి చనిపోయిన మొక్కల స్ధానం కొత్త మొక్కలను నాటించి కాలుష్య రహిత వాతావరణాన్ని పెంపోదించుకోవాలని సూచించారు.  గ్రామాలలో వివిధ రకాల మొక్కలను నాటించాలని (రవి, మర్రి, చింత, ఉసిరి, మునగ, వేప, కానుయాగ వృక్షాలను పెంచాలను)తెలిపారు.సెర్ప్ విభాగం లోని నాన్ ఫామ్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాల విధ్యార్ధులకు రెండు జతలలో ఒక్క జత  దుస్తులను కుటించి పంపిణీ చేయడం జరిగినదని అలాగే కుట్టు మిషన్స్ మరియు కటింగ్ మిషన్ తెప్పించడం జరిగినదని తెలిపారు.స్త్రీనిధికి సంబందించి లోన్ మంజూరీ చేసే క్రమంలో డాక్యుమెటేషన్ ఖచ్చితం చేయాని అలాగే అట్టి డాక్యుమెంటేషన్ లో యూనిట్ సంబందించి ఖచ్చితంగా వుండాలని పేర్కొన్నారు. పశు సమర్ధక శాఖ ద్వారా యూనిట్ల గుర్తించి అట్టి మదర్ యూనిట్లను పాలిచ్చే జంతువులు (బర్రెలు, ఆవులను) ఇప్పించాలని తెలిపారు.
అదేవిదంగా మత్య శాఖ ద్వారా  కేటాయించి. వారికి రూ.1000000/- మంజూరీ చేసి, ఎస్ హెచ్ జి ద్వారా నిర్వహించాలని అలాగే ఏపిఎం, సిసి లు ద్వారా  మహిళా సంఘాలకు అవగాహన కల్పించవలసినది గా సూచించారు.మీ సేవా కేంద్రాలను నిర్వహించడానికి సరియిన మార్గదర్శకాలను తయారు చేసుకోవాలని సూచించారు.మీ సేవా కేంద్రాలను నిర్వహించుటకు మొదటగా మహిళా సంఘాలకు ప్రాధాన్య ఇవ్వాలని అన్నారు.సోలార్ యూనిట్లు,కాంటీన్లు నిర్వహణ  ఒక్క పి పి టి తయారు చేసి అట్టి సెంటర్ల నిర్వహణకు స్థలాలను గుర్తించి పంపాలని అలాగే సెంటర్లను జనావాసల గల ప్రదేశాలలో  (కూలీల వుండే అడ్డాలు, హాస్పటళ్ళు, బస్టాండ్ లలో, రైల్వే స్టేషన్ల ను) పెట్టాలని సూచించారు.
జి.పి.లను నిరంతరం తనిఖీలు చేపట్టండి.
పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.
జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే పనులు, కార్యక్రమాలు పారదర్శకంగా ప్రజలకు ఉపయోగపడే విదంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో గల 475 జి.పిలను ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓ లు, ఎంపీ ఓ లు పర్యవేక్షణలో పాటు తనిఖీలు చేపట్టాలని సూచించారు.సీజనల్ వ్యాధుల పట్ల తీసుకుంటున్న జాగ్రత్తల పై ఆధికారులతో సమీక్షించారు. జి.పి లలో నిధుల కేటాయింపులు అలాగే తీర్మానాలు, కమిటీల వివరాలు చేపట్టిన పనుల వివరాలు అందచేయాలని ఆదేశించారు. అదేవిదంగా నూతన జి.పి భవనాలు, మరుగుదొడ్ల ఏర్పాట్లు, జి.పి.లలో సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. వర్షాకాలం కావున గ్రామ పంచాయతీని శుభ్రంగా ఉండేలా చూడాలని బ్లీచింగ్, మలాథియన్  సిద్ధంగా ఉంచుకోవాలని జిపిలలోని ట్యాంకులలో బ్లీచింగ్ కలపాలని కలెక్టర్ తెలిపారు. అన్ని పంచాయతీలలోని వాటర్ ట్యాంకులను  1,11, 21 తేదీలలో ట్యాంకులను శుభ్రపరచాలని కలెక్టర్ పేర్కొన్నారు. వర్షాలు పడినప్పుడు నీటి నిలువలు ఉండే చోట వాటిని మరంతో నింపాలని కలెక్టర్ తెలిపారు. గ్రామాలలోని సైడ్ కాలువలు చివరన ఇంకుడు గుంటల ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాలలో ఇంకుడుగుంట లను ప్రోత్సహించాలని తెలిపారు. అదేవిదంగా జి.పి.లలో చేపట్టిన పనులకు సంబంధించి రికార్డ్స్  అందుబాటులో ఉండాలని అలాగే పనుల చెల్లిపులకు సంబంధించి ఎం.బి బుక్స్ తప్పక రాయాలని సూచించారు. ముఖ్యంగా జి.పి. లో నర్సరీల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో ఎరువులు, విత్తనాలకు కొరతలేదు.
రైతులకు మెరుగైన సేవాలందాలి.
అనంతరం కలెక్టర్ వ్యవసాయ అధికారులతో సమీక్షించారు వాన కాలంలో సాగుచేయదగిన వరి, పత్తి, కంది, పెసర మొదలైన పంటలు సరిపడా విత్తనాల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఇప్పటివరకు డీలర్ల వద్ద పత్తి విత్తనాలు 35,090 ప్యాకెట్స్ అలాగే 17,312 క్వింటాల వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని శ్రీధర్ రెడ్డి కలెక్టర్ వివరించారు. రైతులు లైసెన్స్ పొందిన ఆధికృత డీలర్ల వద్ద మాత్రమే ఎరువులు విత్తనాలు పురుగుమందులు కొనాలని, వారికి సంబంధించిన బిల్లులు, ప్యాకెట్ సంచులు, జాగ్రత్తగా ఉంచుకోవాలని తెలిపారు. జిల్లాలో ఎరువుల కొరతలేదని యూరియా 35,357 ఎం టి ఎస్ , డిఏపి 2,328 ఎంటిఎస్, కాంప్లెక్స్ ఎరువు 15,209 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయని రైతులెవరు ఆందోళన చెందవద్దని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో పత్తి 89,145 ఎకరాలలో వరి 4,21,202 ఎకరాలలో సాగు అంచనా వేయడం జరిగిందని వ్యవసాయ అధికారి కలెక్టర్కు తెలిపారు. వ్యవసాయ శాఖ ద్వారా నిర్వహిస్తున్న రైతు భరోసా రైతు బీమా రైతు వేదికలు అమలుతీరును పురోగతిని సమీక్షించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మధుసూదన్ రాజు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి కే సురేష్ కుమార్ ఆయా శాఖలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love