శ్రీ గౌతమి స్కూల్‌లో ఒలింపియాడ్ విజేతలకు సత్కారం
హాజరైన మున్సిపల్ ఛైర్పర్సన్ జూపల్లి శశికళ రమేష్ బాబు
నవతెలంగాణ – అశ్వారావుపేట
విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించే ఉద్దేశంతో శ్రీ గౌతమి స్కూల్ లో నిర్వహించిన ఒలింపియాడ్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్పర్సన్ జూపల్లి శశికళ రమేష్ బాబు విజేతలకు గోల్డ్ మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా శశికళ మాట్లాడుతూ, పోటీ పరీక్షలు విద్యార్థుల్లో పోటీ స్పూర్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు నిరంతరం కృషి చేస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ, విద్యార్థుల విజయానికి తల్లిదండ్రుల సహకారం మరియు ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం ఎంతో ముఖ్యమని తెలిపారు. భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులు ఒలింపియాడ్ పరీక్షల్లో ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మి, కరస్పాండెంట్ చలపతిరావు, బోటనీ ఉపాధ్యాయుడు బాలాజీ, నర్సింగ్ సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ కార్యక్రమం ముగిసింది.



