- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ట్రక్కు, జీపు ఢీకొన్నగా తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మంది వరకు గాయపడ్డారని అధికారులు శనివారం తెలిపారు.కుటుంబ సభ్యుడి అస్థికలను నిమజ్జనం చేయడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సేవల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై స్థానిక అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



