Saturday, June 6, 2026
E-PAPER
Homeజిల్లాలుగంజాయి పై ఉక్కుపాదం: ఎస్సై ప్రమోద్ కుమార్ గౌడ్

గంజాయి పై ఉక్కుపాదం: ఎస్సై ప్రమోద్ కుమార్ గౌడ్

- Advertisement -

నవతెలంగాణ-పెద్దవంగర: గంజాయి పై ఉక్కుపాదం మోపుతామని ఎస్సై చిలువేరు ప్రమోద్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మండలాన్ని గంజాయి రహిత ప్రాంతంగా మార్చేందుకు పోలీసులు చర్యలను మరింత ముమ్మరం చేసినట్లు తెలిపారు. గంజాయి వినియోగాన్ని గుర్తించేందుకు అవసరమైన యూరిన్ టెస్టింగ్ కిట్లు పోలీస్ స్టేషన్‌ లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మండలంలోని గ్రామాల్లో ఎవరైనా గంజాయి సేవిస్తున్నట్లు సమాచారం అందితే వెంటనే పరీక్షలు నిర్వహించి నివేదికలు సేకరిస్తామని చెప్పారు. గంజాయి సేవించిన వారితో పాటు వారికి మత్తు పదార్థాలు అందిస్తున్న వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి రహిత పెద్దవంగర లక్ష్య సాధనలో ప్రజల భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -