ఫ్రాన్స్‌లో భారీ భూకంపం…

నవతెలంగాణ – పారిస్‌: ఫ్రాన్స్‌లో భారీ భూకంపం వచ్చింది. దీంతో దేశంలోని పశ్చిమ ప్రాంతాలు వణికిపోయాయి. శుక్రవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) పశ్చిమ ఫ్రాన్స్‌లో 5.8 తీవ్రతతో భూమి కంపించింది. దీని ప్రభావంతో పెద్ద సంఖ్యలో ఇండ్లు కూలిపోయాయని ఫ్రెంచ్‌ సెంట్రల్‌ సీస్మోలజికల్‌ బ్యూర్‌ తెలిపింది. భూకంపం ధాటికి పలు ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు నేలమట్టమయ్యాయని, దీంతో 1,100 ఇండ్లు అంధకారంలో చిక్కుకున్నాయని వెల్లడించింది. అయితే భూకంప తీవ్రత 5.3గానే నమోదయిందని నేషనల్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ సీస్మిక్‌ సర్వైలెన్స్‌ ఆర్‌ఈఎన్‌ఏఎస్‌ఎస్‌ పేర్కొన్నది. కాగా, ఇప్పటివరకు ఫ్రాన్స్‌లోని ప్రధాన భూభాగంలో నమోదైన శక్తివంతమైన భూకంపాల్లో ఇది ఒకటని దేశ పర్యావరణ మంత్రి క్రిస్టోఫ్ బెచు అన్నారు. 2000 సంవత్సరం తర్వాత ఫ్రాన్స్‌లో భారీ భూకంపం నమోదవడం ఇదే మొదటిసారి.

Spread the love