ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌– 11మంది మావోయిస్టులు మృతి
రారుపూర్‌ : చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. నారాయణ్‌పూర్‌ జిల్లాలో మంగళవారం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో 11మంది మావోయిస్టులు మరణించారని పోలీసులు తెలిపారు. ఖొకామెటా పోలీసుస్టేషన్‌ పరిధిలోని ధనంది-కుర్రేవాయ అడవుల్లో మావో యిస్టులకు, భద్రతా సిబ్బందికి మధ్య కాల్పులు జరిగాయని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. నక్సల్‌ వ్యతిరేక చర్యల్లో భాగంగా చేపట్టిన ఆపరేషన్‌లో వివిధ భద్రతా దళాలకు చెందినవారు పాల్గొన్నారు. జిల్లా రిజర్వ్‌్‌ గార్డులు, ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌, సరిహద్దు భద్రతా బలగాలు, ఇండో టిబెటన్‌ సరిహద్దు పోలీసులకు చెందిన సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. పోలీసులను గుర్తించిన మావోయిస్టులు ఎదురు కాల్పులు జరపడంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు మొదలయ్యాయని, ఇప్పటికీ ఆగకుండా ఇంకా కాల్పులు జరుగుతున్నాయని ఐజీ సుందరరాజ్‌ తెలిపారు అయితే ఇవి ప్రభుత్వ హత్యలేనని పౌరసంఘాలు ఆరోపిస్తున్నాయి..

Spread the love