భారీగా పెరిగిన టమాటా ధరలు

నవతెలంగాణ – హైదరాబాద్: టమాటా ధరలు మళ్లీ సెంచరీ వైపు పరుగులు పెడుతున్నాయి. హైదరాబాద్‌లోని మార్కెట్లలో నాణ్యమైన మొదటి రకం టమాటా ధర రూ. రూ.80-90 వరకు పలుకుతోంది. రెండో రకం టమాటాను రూ.60-70కి అమ్ముతున్నారు. అటు హోల్‌సేల్‌ మార్కెట్లలో రూ.120కి మూడు కిలోల చొప్పున విక్రయిస్తున్నారు. మరోవైపు ఉల్లిపాయల ధర కూడా భారీగా పెరిగింది. కేజీ ఉల్లి రేట్ రూ.50-60 పలుకుతోంది. టమాటా, ఉల్లి రేట్లతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు.

Spread the love