Wednesday, August 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంహైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సేవలను కొనసాగించాలి

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సేవలను కొనసాగించాలి

- Advertisement -

నిజాయితీగా పనిచేసే వారికి 
ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం
విశ్రాంత పోలీస్ అధికారుల సంఘం
​నవతెలంగాణ-ఖమ్మం టౌన్‌

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సేవలను ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కొనసాగించే అంశంపై ప్రభుత్వం అన్ని చట్టపరమైన అవకాశాలను పరిశీలించాలని కోరుతూ విశ్రాంత పోలీస్ అధికారుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్. రాధాకృష్ణమూర్తి, రుద్ర వెంకటనారాయణ, గౌరవ అధ్యక్షులు ఎస్వీ ప్రతాపరెడ్డి, లావుడియా రాముల నాయక్ (‌మాజీ ఎమ్మెల్యే), బిళ్ళా అశోక్ కుమార్, ఉపాధ్యక్షులు బి.నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం సమర్పించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ భూములు, ప్రజా ఆస్తుల పరిరక్షణలో ఏవీ రంగనాథ్ నిబద్ధతతో, ధైర్యంగా విధులు నిర్వహిస్తున్నారని సంఘం ప్రతినిధులు తెలిపారు. ప్రజా ప్రయోజనాల కోసం నిజాయితీగా పనిచేసే అధికారులను ప్రోత్సహించి, వారి సేవలను వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -