నేను పక్కా లోకల్ : పోచారం

– బాన్సువాడ నా ఇల్లు, ప్రజలే నా కుటుంబం 

– మాజీ స్పీకర్ ఎమ్మెల్యే: పోచారం శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
పోలింగ్‌ ముగిసింది. సుదీర్ఘమైన, హోరాహోరీగా, హోరాహోరీగా ప్రచారం సాగి సోమవారం ఎన్నికలు ముగియడంతో మాజీ స్పీకర్, బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తన మిత్రులతో కలసి సరదాగా బాన్సువాడ పట్టణంలో పర్యటించారు. ప్రజలతో, మిత్రులతో కలిసి టీ కొట్టులో టీ తాగారు. ఆదివారం వరకు ఎన్నికల బిజీతో క్షణం తీరిక లేకుండా ఉన్న మాజీ శాసనసభ సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి నేడు బాన్సువాడ పట్టణంలోని టీ స్టాల్ లో అలా ప్రశాంతంగా చాయ్ తాగుతూ ఎన్నికలు ఉన్నా లేకపోయినా నేను మాత్రం బాన్సువాడ లోకల్ అంటూ మిత్రులతో ముచ్చటించారు. బాన్సువాడ పాత మున్సిపల్ కాంప్లెక్స్ లో ఉన్న ఇమ్రాన్ టీ హోటల్ కు ఈరోజు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో వెళ్లిన పోచారం ఇతర టీ తగేవారితో చాయ్ తాగుతూ ముచ్చట్లు పెట్టారు. ఎన్నికలు వస్తాయి పోతాయ్ , బయటి నాయకులు, అభ్యర్థులు ఓట్లు అయిపోగానే వాళ్ళ ఊరికి పోతారు. నాకు మాత్రం బాన్సువాడే నా ఊరు, ఇదే నా ఇల్లు, బాన్సువాడ ప్రజలే నా కుటుంబం.. అంటూ చాయ్ ని ఆస్వాదించారు. కొందరు అభ్యర్థులు, నాయకులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ప్రజలను మభ్యపెట్టి ఆశలు చూపి ఎన్నిక కాగానే చేతులు దులుపుకొని వెళ్ళిపోతారు. కానీ నేను గత 35 ఏండ్లగా లోకల్ లోనే ఉంటూ ప్రజల కష్ట సుఖాలను చూస్తున్నారని ఆయన అన్నారు. పోచారం వీరి వెంట బాన్సువాడ మున్సిపాలిటీ చైర్మన్ గంగాధర్, కృష్ణారెడ్డి, మైనార్టీ నాయకుడు వహాబ్ సాబ్, నార్ల రవీందర్, ఏజాజ్ తదితరులు ఉన్నారు.
Spread the love