Monday, July 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలయాభివృద్ధికి కృషి చేస్తా 

ఆలయాభివృద్ధికి కృషి చేస్తా 

- Advertisement -

జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ 
నవతెలంగాణ-నెల్లికుదురు 

మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాభివృద్ధికి కృషి చేస్తానని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ తెలిపారు. ఆదివారం ఆయన ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వెంకటాపురం నేనాల గ్రామంలో పర్యటించి, గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మృతుల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం స్తానిక నాయకులు మండల కేంద్రంలోని శివాలయం, రంగనాయక స్వామి దేవాలయం, హనుమాన్ దేవాలయం, ముత్యాలమ్మ తల్లి, లింగామంతుల దేవాలయ అభివృద్ది గురించి మండల అధ్యక్షులు చెందు రాజ్ కుమార్ యాదవ్, దేవాలయ కమిటీ ప్రకాష్ మాజీ సర్పంచ్ యాదగిరి రెడ్డి, మాజీ ఎంపిటిసి వేన్నాకుల శీను, పట్టణ అధ్యక్షులు ప్రవీణ్ లు ఈ ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించి సహకరించాలని ఆయనకు విన్నవించారు. ఈ క్రమంలో ఆయన వెంటనే స్పందించి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్టు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వల్ల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి మదన్, చీకటి మహేష్, గడ్డం అశోక్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు నల్లని పాపారావు, తోట రమేష్, శివ సాయి, జిలకర యాకన్న, మండల ప్రధాన కార్యదర్శిలు, మండల, జిల్లా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -