Thursday, April 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లా టాపర్లుగా మెరిసిన ఆదర్శ విద్యార్థులు

జిల్లా టాపర్లుగా మెరిసిన ఆదర్శ విద్యార్థులు

- Advertisement -

నవతెలంగాణ-కాటారం 
పదో తరగతి ఫలితాల్లో కాటారం మండలానికి గర్వకారణంగా ఆదర్శ హైస్కూల్ విద్యార్థిని అలిపిరెడ్డి మనోజ్ఞ నిలిచింది. 600/590 మార్కులు సాధించి భూపాలపల్లి జిల్లా టాపర్‌గా నిలిచారు. రాష్ట్రస్థాయిలోనూ ఉన్నత మార్కులు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరు తెచ్చింది. గౌతంకృష్ణ 582 మార్కులు సాధించగా, ఆరాధ్య 577, సాయి చరణ్య 576, తనీష్ 576, యాప్నిక 575, చరణ్ 575, స్మిత 574, హర్షవి 573, మాధుర్య 570 మార్కులు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. పాఠశాల నుండి 550కి పైగా మార్కులు సాధించిన వారు 15 మంది ఉండగా, 500కి పైగా మార్కులు సాధించిన వారు 45 మంది ఉన్నారు. ఈ సంవత్సరం ఆదర్శ హైస్కూల్ 100 శాతం ఉత్తీర్ణత నమోదు చేయడం విశేషం.

మనోజ్ఞ సాధించిన ఘనతపై పాఠశాల చైర్మన్ జనగామ కరుణాకర్ రావు, కరస్పాండెంట్ జనగామ కార్తీక్ రావు, ప్రిన్సిపాల్ కృషిత హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. క్రమశిక్షణతో చదువుతూ, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో కష్టపడి ఈ ఫలితాన్ని సాధించానని మనోజ్ఞ తెలిపింది. ఈ విజయోత్సాహంలో భాగంగా కాటారం కూడలిలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు బాణాసంచా పేల్చి, స్వీట్లు పంచుతూ సంబరాలు నిర్వహించారు. జిల్లా విద్యాధికారి రాజేందర్, మండల విద్యాధికారి శ్రీదేవి సహా పలువురు ప్రముఖులు మనోజ్ఞను అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -