- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఈనెల 28వ తేదీన పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పరాగ్.. ఈ– సిగరెట్ తాగుతూ కనిపించాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన బీసీసీఐ.. ఈ మేరకు కఠిన చర్యలు చేపట్టింది. ప్లేయర్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.1 కింద రియాన్ పరాగ్‌పై లెవెల్ 1 నేరం రుజువైంది.మ్యాచ్‌లో 25 శాతం ఫైన్‌తోపాటు ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. రియాన్ తన తప్పును అంగీకరించినట్లు బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. మ్యాచ్ రిఫరీ అమిత్ శర్మ విధించిన శిక్షను పరాగ్ అంగీకరించాడని బీసీసీఐ పేర్కొంది. అంటే ప్రస్తుతం అతడికి 25 శాతం జరిమానా అంటే.. దాదాపు రూ. 25 లక్షలు అవుతుంది.
- Advertisement -



