Thursday, April 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి: దండు రమేష్

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి: దండు రమేష్

- Advertisement -

నవతెలంగాణ-కాటారం 
రైతులు తమ వరి ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని ఈజీసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్, కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్  పంతకాని తిరుమల సూచించారు. గురువారం కాటారం మండలం రేగులగూడెం గ్రామపంచాయతీలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రభుత్వ ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు న్యాయమైన ధర లభిస్తుందని తెలిపారు. మధ్యవర్తుల వద్దకు వెళ్లకుండా నేరుగా కేంద్రాలకు ధాన్యం తీసుకురావాలని సూచించారు.

తెలంగాణ ప్రభుత్వం రైతాంగ సంక్షేమం కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని వారు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో రైతుల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి జరుగుతోందని తెలిపారు. రుణమాఫీ, సన్న వడ్లకు బోనస్, రైతు భరోసా, సబ్సిడీపై యంత్రాల పంపిణీ వంటి పథకాల ద్వారా రైతును ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పీఏసీఎస్ గారెపల్లి (K) పరిధిలోని ఈ కొనుగోలు కేంద్రం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని, సమీప గ్రామాల రైతులు కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో  మండల వ్యవసాయ అధికారిణి పూర్ణిమ, సర్పంచ్ పాగే ఆమని సురేష్, ఉప సర్పంచ్ పాలరాపు వెంకటస్వామి ఏఎమ్సీ డైరెక్టర్ పిల్లమరి రమేష్, పీఏసీఎస్ ప్రత్యేక అధికారి రాజు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఆంగోతి సుగుణ, డీసీసీ జనరల్ సెక్రటరీ కుంభ స్వప్న రెడ్డి, అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు చీమల సందీప్, నాయకులు వెంకటరెడ్డి, బుచ్చయ్య, తుటి నారాయణ, పాక్స్ సీఈఓ సతీష్, ఏఈఓ అస్మా, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ కుంభం రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -