గర్ల్స్ హాస్టల్ అల్పాహారంలో బల్లి పడితే యూనివర్సిటీ అధికారులు స్పందించరా: ఎస్ఎఫ్ఐ

– నిర్లక్ష్యం వాహించిన కేర్ టేకర్లను సస్పెండ్ చేయాలి…
నవతెలంగాణ – డిచ్ పల్లి 
తెలంగాణ యూనివర్సిటీలోని గర్ల్స్ హాస్టల్ లో అల్పాహారంలో బల్లి పడితే యూనివర్సిటీ అధికారులు శనివారం వరకు. స్పందించరా అని, ఇంత పేద్ద సంఘటన చోటు చేసుకున్న యూనివర్సిటీ ఇన్చార్జ్ వైస్ ఛాన్సలర్ సందీప్ కుమార్ సుల్తానియ టీయూ ను సందర్శించలేదని, వేంటనే సందర్శించాలని,నిర్లక్ష్యం వాహించిన కేర్ టేకర్లను వేంటనే సస్పెండ్ చేయాలని  భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నిజామాబాద్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్ మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీ లోని గర్ల్స్ హాస్టల్  మెస్ లో అల్పాహారంలో బల్లి పడితే యూనివర్సిటీ అధికారులు స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా విద్యార్థినులకు నాణ్యమైన భోజనాన్ని అందించని కేర్ టేకర్లపై ఇప్పటివరకు రిజిస్ట్రార్ యాదగిరి  చర్యలు తీసుకోకపోవడం విడ్డూరమని పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ ఇన్చార్జ్ వైస్ ఛాన్స్లర్ సందీప్ కుమార్ సుల్తానియా తెలంగాణ యూనివర్సిటీ నీ సందర్శించాలని డిమాండ్ చేశారు. విద్యార్తినిలు అనారోగ్యం పాలవుతే ఎలా అని ప్రశ్నించారు. గతంలో గర్ల్స్ హాస్టల్ లో ఇలాంటి సంఘటనలు అనేకసార్లు జరిగిన యూనివర్సిటీ యంత్రాంగం పట్టించుకోవడంలో విఫలమైందన్నారు. వెంటనే వంట మాస్టర్ లపై చర్యలు తీసుకొని విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని లేకపోతే యూనివర్సిటీ పరిపాలన భవనాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మహేష్, నగర అధ్యక్షులు గణేష్, వేణు, రాజు తదితర నాయకులు పాల్గొన్నారు.
Spread the love