6 గ్యారెంటీలు..420 హామీలు..

– కాంగ్రెస్ పార్టీ బుడేర్ఖాన్ మాటలు నమ్మవద్దు..
– ఐదు రోజుల్లో తెస్తానన్న పసుపు బోర్డు ఎక్కడ ?.. 
– షుగర్ ఫ్యాక్టరీ సొంత డబ్బులతో తెరిపిస్తున్న అన్నావ్ ఎక్కడ..?
– నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ 
నవతెలంగాణ – డిచ్ పల్లి
కాంగ్రెస్ అదికారంలోకి రాకముందు ప్రజలకు 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి అమలు చేయలేదని, కాంగ్రెస్ పార్టీ బుడేర్ఖాన్ మాటలను నమ్మవద్దని,గత పార్లమెంటు ఎన్నికల సమయంలో బీజేపీ అభ్యర్థి అర్వింద్  ఐదు రోజుల్లో తెస్తానన్న పసుపు బోర్డు ఎక్కడ ఉందని ?, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ సొంత డబ్బులతో తెరిపిస్తున్నఅన్నావ్ ఎక్కడ తేరిపించవుఅని..?వంద రోజుల్లో అమలు చేస్తానన్న పథకాలు ఎక్కడ? నేటికీ 136 రోజులు అయిందని, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు వస్తే నాకు కోండంత బలమని నిజామాబాద్ బిఅర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల సన్నాహక బిఆర్ఎస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశం డిచ్ పల్లి మండలం లోని  బర్దిపూర్ శివారు లోని ఫంక్షన్ హాల్ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ , జిల్లా పరిషత్ చైర్మన్ విట్టల్ రావు, మాజి ఎమ్మెల్సీ వి.జి గంగాధర్ గౌడ్,  జిల్లా యువ నాయకులు, జిల్లా ఒలంపిక్ ఉపాధ్యక్షులు ,ధర్పల్లి జడ్పిటిసి బాజిరెడ్డి జగన్మోహన్  ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈసందర్భంగా ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న.. ఓడ దిగిన తరవాత బోడి మల్లన్న అన్నట్లు రేవంత్ తీరు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా అంటూ మాయమాటలు చెప్పి, ఇప్పుడు సీఎం అయ్యాక రైతుల దిక్కు కూడా చూడకుండా హైదరాబాద్ – ఢిల్లీ చక్కర్లు కొడ్తున్న మోసకారి రేవంత్ రెడ్డి అన్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు దురాశ కు పోయి దుఃఖాన్ని తెచ్చుకున్నారని వివరించారు.
కాంగ్రెస్ అబద్ధ ప్రచారాలను నమ్మి మోసపోయారు. కళ్యాణ లక్ష్మి, షాది మూబరక్ కు లక్షా రూపాయలతో పాటుగా తులం బంగారం ఎక్కడ ఉందని, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు ఎక్కడ… మూడు పంటలకు ఇస్తానన్న రైతుబంధు ఎక్కడ… 24 గంటల కరెంటు ఎక్కడ… రెండు లక్షల రుణమాఫీ ఎక్కడ… కాంగ్రెస్ పార్టీ 420 హామీలు.. ప్రజలకు అబద్ధం చెప్పి.. అధికారం ఎక్కారు.. ప్రజలను అరిగోస పెడుతున్నారు.. వడ్లకు అదనంగా 500 బోనాస్ ఇచ్చి వడ్లు కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు ఇంతవరకు లేదు.. స్థానికంగా ఉన్న నిజమాబాద్ ఎంపీ  చేసింది శూన్యంమన్నారు.. ఏ ఒక్క గ్రామానికి వెళ్లి చేసిందిలేదని, సోషల్ మీడియాలో అబద్ధ ప్రచారాలు చెప్పడం తప్ప ప్రజలకు చేసింది శూన్యమని విమర్శించారు. ఐదు రోజుల్లో తెస్తానన్న పసుపు బోర్డు ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ఇంకా రాలేదని, సొంత డబ్బులతో షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్ చేయిస్తానన్నావ్ ఇంతవరకు ఉసే లేదన్నారు. మళ్లీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వేళ్తున్నవని, గ్రామాలకు వచ్చినప్పుడు నిలదీసి ఇచ్చిన హామీ లకుఎండగట్టలని పిలుపు నిచ్చారు. కాంగ్రెస్, బిజెపి పార్టీల నాయకుల మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని ఎంపీ అభ్యర్థి  బాజిరెడ్డి గోవర్థన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఇందిరా లక్ష్మి నర్సయ్య, పార్టీ సీనియర్ నాయకులు, శక్కరీ కొండ కృష్ణ, ఓడెం నర్సయ్య, పద్మారావు, నయీమ్, వివిధ గ్రామాల ఎంపీటీసీలు సర్పంచులు ఉపసర్పంచులు, యువజన సంఘాల నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు బిఆర్ఎస్ పార్టీ  అన్ని అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love