నల్లవెల్లి సోసైటి ఇంచార్జీ చైర్మన్ గా రమేష్…

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని నల్లవెల్లి సహకార సొసైటీ ఇంచార్జీ చైర్మన్ గా రమేష్ కు డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ అధికారి ఎన్ శ్రీనివాస్ రావు నియామకపు పత్రాన్ని  శుక్రవారం అందజేశారు. అనంతరం అయన తాత్కాలిక భాద్యతలను స్వీకరించారు.ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ అధికారి ఎన్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ఇప్పటి వరకు చైర్మన్ గా ఉన్న సాంబార్ మోహన్ పై తొమ్మిది మంది డైరె క్టర్లు ఈ నేలా 1న అవిశ్వాసానికి మద్దతు గా నోటిసు అందజేశారని దానిలో భాగంగానే ఈనెల 3 చైర్మన్, మిగిలిన సబ్యులకు నోటిసులను అందజేస మని, ఈ నేలా 19న అవిశ్వాస తీర్మానంపై చర్చా, సమావేశం ఏర్పాటు చేసినట్లు డిసిఓ వివరించారు. శుక్రవారం 11గంటలకు నిర్వహించావల్సిన సమావేశం కు అరగంట ముందు చైర్మన్ సాంబార్ మోహన్ చైర్మన్ పదవికి రాజీనామా సమర్పించారు.వేంటనే దాన్ని ఆమోదించినట్లు తెలిపారు. రాజినామా సమర్పించడంతో కోరాం ఉన్న అవిశ్వాసం పై చర్చా  లేకుండా ఖాలి అయిన చైర్మన్ స్థానానికి ఇంచార్జీ చైర్మన్ గా ప్రస్తుతం వైస్ చైర్మన్ గా ఉన్న రమేష్ కు తాత్కాలిక చైర్మన్ గా భాద్యతలను అప్పగించాడం జరిగిందన్నారు. త్వరలో రాష్ట్ర ఎన్నికల అథారిటీ కి నివేదిక ను అందజేయడం జరిగుతుందని, చైర్మన్ ఎన్నిక తేదీ ఎన్నికల అథారిటీ ప్రకటించాడం జరుగుతుందని డిసిఓ పేర్కొన్నారు.
క్యాంపు నుండి నేరుగా..
గత కొన్ని రోజులుగా 9మంది డైరెక్టర్లు క్యాంపులో ఉంటు న్నారు. శుక్రవారం డీసీవో శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో బలనిరూపణ పరీక్ష ఉదయం 11గంటలకు ఉండటంతో సమయానికి డైరెక్టర్లు సహకార సొసైటీ కి చేరుకున్నారు. త్వరలో జరిగే చైర్మన్ ఎన్నిక తేదీ కంటే ముందే నల్లవెల్లి గ్రామానికి చెందిన డైరెక్టర్ నోముల శ్రీనివాస్ రెడ్డి కానున్నాట్లు తేలిసింది. ఏలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా డిచ్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కె మల్లేష్, ఇందల్ వాయి ఎస్సై మనోజ్ కుమార్ పోలిస్ సిబ్బంది తో బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమం లో మాజీ ఐడిసిఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సంతోష్ రెడ్డి,సిఈఓ తేజ గౌడ్, సహకార సొసైటీ క్లస్టర్ అధికారి బి పోచయ్య తోపాటు డైరెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love