ఆసరా పెన్షన్లు సకాలంలో పంపిణీ చెయ్యకుంటే అసెంబ్లీని ముట్టడిస్తాం

– 18వ తేదీ వచ్చినా పింఛన్లు పంపిణీ చెయ్యని రేవంత్ రెడ్డి సర్కార్ తీరును నిరసిస్తూ కళ్లకు గంతలు కట్టుకొని నల్లబ్యార్జితో నిరసన
–  భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్
నవతెలంగాణ – చివ్వేంల
ఆసరా పెన్షన్లు సకాలంలో పంపిణీ చెయ్యకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని  భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు. రాష్ట్రంలో వెంటనే ఆసరా పింఛన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ  మండలంలోని  గుంపుల గ్రామంలో కళ్లకు గంతలు కట్టుకొని నల్ల బ్యాడ్జీతో నిరసన తెలిపిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ..జనవరి 18వ తేదీ వచ్చిన డిసెంబర్ నెల పింఛన్లు నేటికీ పంపిణీ చెయ్యని నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ తీరు దురదృష్టకరమని , రాష్ట్రంలో పింఛన్లు సకాలంలో రాక వృద్ధులు వితంతువులు, వికలాంగులు, నరకయాతన అనుభవిస్తుంటే నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు నిమ్మకు నీరు ఎత్తినట్లుగా ప్రవర్తిస్తుండటం బాధాకరమని, రాష్ట్రంలో ప్రతినెలా ఒకటో తేదీ నుంచి ఆరవ తేదీలోపే ఆసరా పింఛన్లు పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని , రాష్ట్రంలో నిత్యవసర వస్తువుల ధరలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు వృద్ధులు, వితంతువులు, గీత కార్మికులు ,బీడీ కార్మికులకు ,నాలుగు వేల పెన్షన్లను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love