రోడ్లు సరిగా లేకుంటే టోల్ వసూలు చేయొద్దు…

నవతెలంగాణ – హైదరాబాద్: నాణ్యమైన సేవలు అందించనప్పుడు టోల్ వసూలు చేస్తే ప్రజల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రహదారులు సరిగా లేకుంటే టోల్ ఛార్జీలు వసూలు చేయొద్దని హైవే సంస్థలకు సూచించారు. ‘మనం టోల్ వసూలుపై చాలా ఆత్రుతతో ఉన్నాం. కానీ రోడ్లు సరిగా ఉన్న చోటే ఫీజులు వసూలు చేయాలి. గుంతలు, మట్టితో ఉండే అధ్వానమైన రోడ్లకు టోల్ వసూలు చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది’ అని తెలిపారు.

Spread the love