– కర్నాటకలో కరెంట్ కష్టాలు
– బీఆర్‌ఎస్ మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి సబితాఇంద్రారెడ్డి
నవతెలంగాణ-కందుకూరు
కాంగ్రెస్ మేనిఫెస్టోను నమ్మితే మోసపోతారనీ, కర్నాటక రాష్ట్రంలో కరెంట్ సరఫరా చేయడంలో విఫలమైన కాంగ్రెస్‌ను నమ్మొద్దనీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. పార్టీ టికెట్లను అమ్ముకున్న కాంగ్రెస్ నాయ కులు, అధికారంలోకి వస్తే రాష్ట్రాన్నే అమ్ముకుంటారని మంత్రి ఎద్దేవా చేశారు. సోమవారం కందుకూరు మండలం సరస్వతి గూడ, లేమూరు, తిమ్మాపూర్, జబ్బార్ గూడ బేగంపేట్, అగర్మియాగూడా రాచులూరు, బైరాగిగూడ, కొత్తూరు గ్రామాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొని మంత్రి మాట్లాడుతూ నిత్యావసర సరుకులు విపరీతంగా పెంచిన బీజేపీ పార్టీ ఏ మొహం పెట్టుకుని నేడు ప్రజల ముందుకు వస్తుందని విమర్శిం చారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇస్తున్న హామీలను ప్రస్తుతం వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిం చారు. కేవలం అధికారాన్ని పొందాలనే ఆకాంక్షతో అసాధ్యపు హామీలను గుప్పిస్తుందన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అనేది ప్రజలు ఒకసారి ఆలోచించాలని కోరారు. ప్రస్తుతం తెలంగాణలో రూ.2 వేల పింఛన్, రాబోయే రోజుల్లో రూ.5 వేలు ఇవ్వనున్నట్టు తెలిపారు. గతంలో ప్రభుత్వాస్పత్రులు అంటే నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే వారని, నేడు పోదాం పదా సర్కారు దవాఖాన అంటున్నారన్నారు. మోకాలు చిప్ప ఆపరేషన్లు ఉచితంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేస్తు న్నామని చెప్పారు. రేషన్‌లో సన్నబియ్యం, మహిళల కోసం సౌభాగ్యలక్ష్మి పథకం అమలు చేయబోతు న్నామని, రూ. 400లకే గ్యాస్ సిలిండర్, రైతుబీమా లాగా కోటి కుటుంబాలకు రూ.5 లక్షల బీమా అందిస్తామని తెలిపారు. కేసీఆర్ గెలిస్తే అందరం బాగుపడతా మన్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసిన విధంగానే, ప్రస్తుతానికి ఈ ఎన్నికల్లో ఇస్తున్న హామీలనీ అమలు చేస్తామని మంత్రి హామీనిచ్చారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ చైర్మన్ సురసాని సురేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శోభా ఈశ్వర్‌గౌడ్, బీఆర్‌ఎస్ అధ్యక్షులు మన్నే జయేందర్, ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర మాజీ సభ్యులు చిలకమర్రి నరసింహ, నాయకులు లక్ష్మి నరసింహ రెడ్డి, మేఘనాథ్ రెడ్డి, విజయేందర్ రెడ్డి, సర్పంచులు గంగాపురం గోపాల్ రెడ్డి, పరంజ్యోతి, రాము, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.