జిడ్డు పోవాలంటే..

If you want to lose fat..వంట సమయంలో గోడపై గానీ, స్టౌపై, అలాగే కిచెన్‌లో ఇతర ప్రాంతాలపై నూనె మరకలు, ఇతర మరకలు అవుతుంటాయి. వెంటనే శుభ్రం చేయకపోతే జిడ్డు మరకలు మరింత పేరుకుపోతాయి. అయితే ఇలాంటి నూనె మరకలతో కూడిన జిడ్డును పోగొట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి మరకలను సులభంగా పోగొట్టే కొన్ని చిట్కాలను చూద్దాం..
వంటగది గోడపై నూనె మరకలు ఉంటే ఉప్పు నీటితో కడిగితే మరకలు త్వరగా పోతాయి. కిచెన్‌ వాల్‌ మరకలను శుభ్రం చేయడానికి బేకింగ్‌ సోడా సహాయపడుతుంది. బేకింగ్‌  సోడాతో శుభ్రపరచడం వల్ల జిడ్డు మరకలు తొలగిపోతాయి. తెల్లటి టూత్‌పేస్ట్‌ను ఉపయోగించి మరకలను తొలగించడం సులభం. టూత్‌పేస్ట్‌ని ఆయిల్‌ స్టెయిన్‌ ఉన్న ప్రదేశంలో  అప్లై చేసి ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత రుద్ది కడిగేస్తే మరకలు పోతాయి.నిమ్మ, వెనిగర్‌ కలిపిన మిశ్రమాన్ని గోరువెచ్చని నీళ్లలో వేసి ఈ నీళ్లతో శుభ్రంగా  కడిగేస్తే మరక పోయి మెరుస్తుంది. లిక్విడ్‌ డిష్‌ వాష్‌ను గోడపై స్ప్రే చేసి ఒక గంట పాటు వదిలివేయండి. ఆ తర్వాత గుడ్డపై డిష్‌ వాష్‌ వేసి తుడిస్తే మరకలన్నీ పోతాయి.

Spread the love