ఆయిల్ ఫాం తోటలను అధ్యయనం చేస్తున్న ఐఎఫ్ఎస్  బృందం

– ఆయిల్ ఫాం సాగులో…
– ఆదివాసీ రైతులకు ప్రోత్సాహాం
– బయో డైవర్సిటి చైర్మన్ వెల్లడి… 
– పేట మండలాల్లో ఆయిల్ ఫాం క్షేత్రాల సందర్సన….
నవతెలంగాణ – అశ్వారావుపేట
దీర్ఘకాలిక నికర ఆదాయం తో పాటు అంతర పంటలు సాగుతో అదనపు ఆదాయం అందిస్తున్న ఆయిల్ ఫాం సాగు వైపు ఆదివాసీ రైతులను ప్రోత్సహించనున్నట్లు నేషనల్ బయో డైవర్శిటీ చైర్మన్ అచ్లేందర్  రెడ్డి, ఐఎఫ్ఎస్ కృష్ణ.మూర్తి, ఆంధ్రప్రదేశ్ ఐఎఫ్ఎస్ జయరాజ్ లు స్పష్టం చేశారు.అందులో బాగంగా నే ఆయిల్ ఫాం సాగు పద్ధతులు, ప్రభుత్వ రాయితీలు వంటి అంశాలను క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసినట్లు చెప్పారు.టెక్నికల్ టీమ్ తో శుక్రవారం అశ్వారావుపేట,దమ్మపేట మండలాల్లో పర్యటించారు. ఫాం ఆయిల్ క్షేత్రాలను సందర్శించి రైతులతో మాట్లాడి సాగు పద్దతులు పై ఆరా తీశారు. దమ్మపేట మండలం అల్లిపల్లి, మల్లారం,అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం గ్రామాల్లో ఆయిల్ ఫాం, అంతర పంటల సాగును పరిశీలించారు. ఆయిల్ ఫాం సాగు, యాజమాన్య పద్ధతులు, దిగుబడులు, ట్రాన్స్పోర్ట్, ధర నిర్ణయం, రైతులకు చెల్లింపు,నర్సరీలో మొక్కలు పెంపు వివరాలను ఆయిల్ఫెడ్  డివిజనల్ ఆఫీసర్ ఆకుల బాలకృష్ణ వివరించారు. ఉద్యాన శాఖ ద్వారా మొక్కలు, తోటల నిర్వహణ, అంతర పంటలకు ప్రభుత్వం నుండి మంజూరు చేస్తున్న సబ్సిడీ పధకాలను డి ఎస్ హెచ్ ఒ  సూర్యనారాయణ తెలిపారు. అక్కడ నుండి అశ్వారావుపేట ఫ్యాక్టరీకి చేరుకుని ఆయిల్ ఫాం గెలలు క్రస్సింగ్, ఆయిల్ రికవర్, ఉప ఉత్పత్తుల సేకరణ, మార్కెటింగ్ అంశాలను ఫ్యాక్టరీ మేనేజర్ మంద నాగబాబు వివరించారు. అల్లిపల్లి లో ఆయిల్ఫెడ్ అడ్వైజరీ కమిటీ మెంబర్ ఆలపాటి రామచంద్ర  ప్రసాద్ తో సమావేశమై సాగు వివరాలు సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆయిల్ ఫాం సాగు వల్ల పర్యావరణం కలిగే లాభ నష్టాలను కూడా అంచనా వేసినట్లు తెలిపారు. ఆయన వెంట ఐఐఒపిఆర్  ప్రిన్సిపల్, సైంటిస్ట్ డా.ఎంవీ ప్రసాద్, దమ్మపేట ఉద్యాన అధికారి  సందీప్, ఆయిల్ ఫెడ్ రిసోర్స్ పర్సన్ రాజశేఖర్రెడ్డి, టెక్నికల్ టీమ్ ఉన్నారు. |
Spread the love