ఇటుక బట్టీల చాటున అక్రమ వ్యాపారం

– కోడిపందాలు మరియు గంజాయి అక్రమ రవాణా 

నవతెలంగాణ – తొర్రూర్ రూరల్
తొర్రూర్ డివిజన్ పరిధిలో పలు గ్రామాల్లో ఇటుక బట్టీల చాటున అక్రమ వ్యాపారం యదేచ్చగా సాగుతుంది కోడి పందాలు ఆటలతో మరియు ఇటుక బట్టీలలో గంజాయి కోకెన్ తదితర మత్తు పదార్థాలను అక్రమంగా రవాణా చేస్తున్నారు. డివిజన్ లోని వరంగల్ ఖమ్మం ప్రధాన రహదారిపై ఊరికి దూరంగా మరియు తొర్రూర్ మహబూబాబాద్ ప్రధాన రహదారిపై రోడ్డుకిరువపులా ఇటుక బట్టీలు ఏర్పాటు చేస్తూ ప్రయాణికులకు పొగ దుమ్ము ధూళితో ఇబ్బందులకు గురి అవుతున్న పట్టించుకున్న నాధుడే కరువయ్యాడు. గత నెల క్రితం డివిజన్లోని తొర్రూర్ నెల్లికుదురు మండలాల మధ్య ఉన్న ఆకేరు వాగు వద్ద నిర్వహించిన కోడిపందాల ఆటలలో పోలీసులు 30 కోళ్లు 3 లక్షల రూపాయలు 30 బైకులు మూడు కార్లు సీజ్ చేశారు. ఇది ఇక్కడి వరకే అధికారులకు తెలిసింది కానీ ఇక్కడ తయారుచేసిన ఇటుకల ను హైదరాబాద్ వరంగల్ తదితర ప్రాంతాలకు లారీలలో రవాణా చేస్తూ ఇటుకల మధ్యన గంజాయి తదితర మత్తు పదార్థాలను రవాణా చేస్తున్నట్లు విష్యసనీయ వర్గాల ద్వారా చుట్టుపక్కల రైతుల ద్వారా తెలుస్తుంది. ఊరుకు దూరంగా ఇటుక బట్టీలు ఏర్పాటు చేయడంతో ఎవరు అధికారులు పర్యవేక్షణ చేయక ఇటుక బట్టీల చాటున అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఇక్కడికి వచ్చి ఇటుక వ్యాపారం చేయడంతో పాటు గ్రామాల్లోని కొంతమంది వ్యక్తులను వారికి అనుకూలంగా మార్చుకుంటూ వారికి కొంత డబ్బులు ముట్ట చెబుతూ వారు చేసే వ్యాపారానికి అడ్డు అదుపు లేకుండా పోతుందని సంబంధిత ఇటుక బట్టీల గ్రామాల ప్రజలు తెలుపుతున్నారు ఇప్పటికైనా అధికారులు పర్యవేక్షించి ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన ఇటుక బట్టీలను దూరంగా పంపించాలని మరియు ఇటుక బట్టీల చాటున జరుగుతున్న అక్రమ వ్యాపారాలను వెలికి తీసి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Spread the love