ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ గ్యారెంటీ పథకాలు అమలు 

– శంకుస్థాపన, అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు
– ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు
నవతెలంగాణ- మల్హర్ రావు
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ఆరు గ్యారెంటీలు అమలైయ్యేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు అన్నారు. బుధవారం భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేస్ మిశ్రా,ఎంపిపి మల్హర్ రావుతో కలిసి పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించారు. మల్లారం గ్రామపరిదిలో కస్తూరిబా ఆశ్రమ బాలికల పాఠశాలలో రూ.3 కోట్లతో అదనపు గదులు, రూ.15 లక్షలతో సబ్ హెల్త్ సెంటర్, తాడిచెర్ల గ్రామంలో ఆర్అండ్ఆర్ కింద రూ.4కోట్లతో అభివృద్ధి పనులు, సీసీ రోడ్లు, సిసి సైడ్రైన్, అంగన్వాడి స్కూల్, ప్రైమరీ స్కూల్, కమ్యూనిటీ హాల్, వాటర్ ట్యాంక్, న్యూ ఎలక్ట్రిక్ నూతన లైన్స్, దాదాపుగా రూ. 65 లక్షలతో మండల నూతన తహశీల్దార్ కార్యాలయ భవనం. తాడిచెర్ల గ్రామంలో రూ.25 లక్షలతో గ్రంథాలయానికి, రూ.15 లక్షతో సబ్ హెల్త్  సెంటర్, రూ.15 లక్షలతో డాక్టర్ విశ్రాంత భవనం. మోటు వాగు ఒర్రెపై రొడ్డం నిర్మాణం రూ.40లక్షలు తదితర అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించి మత్స్య శాఖ నుంచి మంజూరైన 9 మంది లబ్ధిదారులకు ట్రాలీ ఆటోలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడారు మార్చి నెల నుంచి 200 యునిట్ల వరకు ఉచిత  విద్యుత్, బస్సు ప్రయాణం, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు పథకాలు ప్రారంభించమన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి గ్రామంలో ఉన్న పాఠశాల నిర్వహణకు మహిళ సంఘాలకు అప్పగించే కార్యక్రమం చేపట్టునట్లుగా తెలిపారు. మండలంలో తాగునీటి సంస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి అదనపు కలెక్టర్ వెంకస్టశ్వర్లు, తహశీల్దార్ రవి కుమార్, ఎంపిడిఓ శ్యాం సుందర్, వైస్ ఎంపీపి బడితేల స్వరూప రాజయ్య, కాంగ్రెస్ పార్టీ ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు రమేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య,యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాoతి, మహిళ అధ్యక్షురాలు కొండ రాజమ్మ, సింగిల్ విండో డైరెక్టర్లు ఇప్ప మొoడయ్య, వొన్న తిరుపతి రావు, ఎంపిటిసిలు నాగరాని, ప్రకాష్ రావు, నాయకులు చెంద్రయ్య, ప్రభాకర్, సురేందర్, బొబ్బిలి రాజు గౌడ్, ఆర్ని ఉదయ్, సమ్మయ్య పాల్గొన్నారు.
Spread the love