– నేను మీ తాండూర్ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి
– ఎన్నికల శంఖారావంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
నవతెలంగాణ-పెద్దేముల్
అసెంబ్లీ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి విమర్శించారు. మంగళవారం మం డల పరిధిలోని గోట్లపల్లి సమీపం వద్ద బీఆర్‌ఎస్ మండలాధ్యక్షులు కోహిర్ శ్రీని వాస ఆధ్వర్యంలో పెద్దేముల్, కోట్‌పల్లి మండలాల బీఆర్‌ఎస్ కార్యకర్తల ఎన్ని కల శంఖా రావ సభ నిర్వహించారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్‌కు మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో రైతు రాజ్యమే కావాలని దిశగా కేసీఆర్ అభివృద్ధి చేస్తు న్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు మరొకసారి అమలు కావాలంటే బీఆర్‌ఎస్‌ను గెలిపించాలన్నారు. ‘నేను మీ తాండూర్ బిడ్డగా నాకు మీరు ఓటు వేసి నన్ను ఆశీర్వదించాలి’ అని వేడుకున్నారు. జిల్లా గ్రంథాలయం శాఖ చైర్మన్ రాజు గౌడ్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పశుగణ అభివృద్ధి శాఖ చైర్మన్ రెడ్డి, ఎంపీపీ అనురాధ రమేష్, రాష్ట్ర ఎంపీ టీసీల ఫోరం ఉపాధ్యక్షులు వెంకటే ష్ చారి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, మండల ఎంపీ టీసీల ఫోరం అధ్యక్షులు వన్ సింగ్, సర్పంచులు పద్మమ్మ, చంద్రప్ప, మోహన్ రెడ్డి, పాండు నాయక్, పాష, రాములు, ఎంపీటీసీ శ్రీనివాస్, తట్టేపల్లి సొసైటీ వై చైర్మన్ అంజయ్య, బీఆర్‌ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ డివై.నర్సింలు, కోట్ పల్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు, మండల యూత్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, వివిధ గ్రామాల ప్రజాప్ర తినిధులు, పార్టీ కార్యకర్తలున్నారు.