భవిష్యత్తు లో ఫార్మా రంగానికే ప్రాధాన్యత

– మెడ్ ప్లస్ హెచ్ ఆర్ ఎండి తాజుద్దీన్
నవతెలంగాణ – చివ్వేంల 
భవిష్యత్తులో ఫార్మా రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని మేడ్ ప్లస్ హెచ్ఆర్ ఎండి తాజుద్దీన్ అన్నారు. శనివారం  మున్సిపాలిటీ పరిధిలోని దురాజ్ పల్లి లోని  ప్రతిష్ట ఫార్మ కళాశాలలో డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఫామ్ డి చివరి సంవత్సర విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కళాశాల చైర్మన్ శివరామకృష్ణయ్య మాట్లాడుతూ గత సంవత్సరం కళాశాలకు NAAC A గ్రేడ్ రావడం కళాశాలకు ఎంతో గర్వించదగ్గ విషయమని ఆయన కొనియాడారు. చదువుకునే దశలోనే విద్యార్థులు భవిష్యత్ తరానికి ఉపయోగపడే విద్యనే ఎంచుకొని చదవడం ద్వారా భవిష్యత్తులో మంచి ఉద్యోగాలను సంపాదించుకోవచ్చని ఆయన అన్నారు. ఈ కళాశాలలో ఏర్పాటుచేసిన క్యాంపస్ ప్లేస్మెంట్ కి 25 మంది విద్యార్థులు ఎంపికయ్యారని హెచ్ఆర్ తెలిపారు. కళాశాలలో చదివే విద్యార్థులు కళాశాల దశలోనే భవిష్యత్తు తరానికి ఉపయోగపడే సైన్స్ పరిజ్ఞానం ఉన్న వాటిపై మెలకువలను నేర్చుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజ్ కుమార్, సెక్రటరీ డాక్టర్ విజయలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మధు, వై ఎన్ కుమార్, రమేష్, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love