విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. అమెరికాలో ఘటన

నవతెలంగాణ-హైదరాబాద్: ఫ్లైట్ టాయిలెట్ లో కనిపించిన అడల్ట్ డైపర్ సిబ్బందిని, ప్రయాణికులను కాసేపు భయాందోళనలకు గురిచేసింది.. ఆకాశంలో దూసుకుపోతున్న విమానాన్ని అత్యవసరంగా కిందికి దిగేలా చేసింది. అనారోగ్య సమస్యల కారణంగా పెద్దవాళ్లు వేసుకునే ఆ డైపర్ ను ఫ్లైట్ సిబ్బంది బాంబుగా భావించడమే ఈ గందరగోళానికి కారణమైంది. అమెరికాలోని పనామా సిటీ నుంచి ఫ్లోరిడాలోని తంపాకు బయలుదేరిన విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులను అందరినీ కిందకు దించి, విమానాన్ని అణువణువూ గాలించిన సెక్యూరిటీ సిబ్బంది అందులో పేలుడు పదార్థాలు ఏవీ లేవని నిర్ధారించాకే మళ్లీ బయలుదేరింది. ఫ్లైట్ లోని 144 మంది ప్రయాణికులను కిందికి దించి విమానంలో బాంబ్ స్క్వాడ్ గాలింపు చేపట్టింది. టాయిలెట్ లోని అనుమానాస్పద వస్తువును అడల్ట్ డైపర్ గా గుర్తించింది. అయినప్పటికీ విమానాన్ని నిశితంగా గాలించింది. పేలుడు పదార్థాలు ఏవీ కనిపించకపోవడంతో ప్రయాణానికి అనుమతిచ్చింది. దీంతో విమానం ఆలస్యంగా ఫ్లోరిడాకు బయలుదేరింది.

Spread the love