భారత దేశం సాంకేతిక రంగంలో అభివృద్ధి చెందింది

– ఏఐసీటీ చైర్మెన్‌ ప్రొఫెసర్‌ టీ. జీ. సీతారాం
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
గత కొన్ని సంవత్సరాల నుంచి భారత దేశం సాంకేతిక రంగంలో మంచి ప్రతిభ చూపిస్తూ అభివృద్ధి చెందిందని ఏఐసీటీ చైర్మెన్‌ ప్రొఫెసర్‌ టీ. జీ. సీతారాం అన్నారు. శుక్రవారం జేఎన్‌టీయూ యూనివర్సిటీ జేఎన్‌టీయూ ఆడిటోరియంలో అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్‌ మహాసంఘ్‌ (సాంకేతిక విద్య) తెలంగాణ రాష్ట్రం అసోసియేషన్‌ జేఎన్‌టీయూ, హైదరాబాద్‌ సహకారతో ”నావిగేటింగ్‌ ది ఆపర్చునిటీస్‌ ఇన్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ టెక్నాలజీ ఫర్‌ ఫ్యూచర్‌ భారత్‌” అనే అంశము పైన ఒక రోజు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆయనతో పాటు అల్‌ ఇండియా జాయింట్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ గూట్టా లక్ష్మణ్‌ జీ, జేఎన్‌టీయూ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కట్టా నరసింహ రెడ్డి, జైపూర్‌ ఎంఎన్‌ఐటీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ప్రొఫెసర్‌ ఎం.కె.శ్రీ మాలి, ప్రిన్సిపాల్‌ డా ఎం అశోక్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థికి ఆచార్య వర్గం ఎలా సపోర్ట్‌గా ఉండి వారిని సమాజంలో ఉత్తమ ఇంజనీర్‌గా ఎలా తీర్చిదిద్దాలో ఈ సదస్సులో తెలియ చేసారు. దేశాన్ని 2047 కల్లా దేశంలో అధిక శాంతం విద్యావంతులు గాను, సొంతముగా పరిశ్రమలు పెట్టు కొనే విధంగా, పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశం కలిపించే విధంగా అక్టివ్‌ ప్రణాళిక తయారు చేసిందన్నా రు. స్కూల్‌ స్థాయి నుంచి నేడు దాదాపు 100 మంది విద్యార్థులు బయట వస్తున్నా వారిలో 25/30 మంది విద్యార్థులు మాత్రమే ఇంజనీరింగ్‌ విద్యార్థులుగా మారుతున్నా రన్నారు. 2035 కు కనీసం 50 మంది విద్య్రార్థులను తీసుకురావాలనే మార్పు కోసం అక్టివ్‌ కషి చేస్తుందన్నారు. నేషనల్‌ ఎడ్యుకేషనల్‌ పాలసీ ఇట్టి లెక్కలు వెలువ రించినది మోడల్‌ స్కూల్‌, ప్రాథమిక విద్యను మెరుగు పరిస్తే నే అమత్కాల్‌ లక్ష్యం నెరవేరుతుందన్నారు. దేశంలో సాంకేతిక విద్యా విధానం అభివద్ధి వల్ల ఎంటర్‌ ప్యూనర్‌ గాను, ఇనోవెటెర్‌ గాను వారిని అభివద్ధి చేసే ఆలోచన ఉందన్నారు. నేడు దేశంలో అనేక ఇంజనీరింగ్‌ కాలేజీ ఉన్నాయి కాని అక్టివ్‌ ఓ నిబంధన ప్రకారం ప్రతి ఇంజనీరింగ్‌ కాలేజ్‌ లోని ప్రతి విభాగములో 90శాతం అడ్మిన్‌ పొందిన కాలేజీలకు ఉత్తమ కాలేజీలుగా గుర్తింపు ఇస్తాం అన్నారు. 2047సంవత్సరం లోపల భారతీయ విద్యార్థులను అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులు, ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులు, పరిశోధకులుగా తీర్చిదిద్ద డామే ఏఐసీటీ ముఖ్య ఉద్దేశము అన్నారు. యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కట్టా నర్సింహా రెడ్డి మాట్లాడుతూ బాబు జగజీవన్‌ రామ్‌ జయంతిని స్మరించుకొంటూ.. ఆయన స్వతంత్ర పోరాటంలో అనేక అటుపోట్లను ఎదుర్కొని దేశం కోసం నిలబడి వ్యక్తి అని కోనియాడారు. అనేక రంగాల్లో నేడు యువత మంచి ఆలోచన చేసి సమాజంలో వస్తున్న మార్పులకు అనుకూలంగా కొత్త కొత్త ఆలోచనలు చేసి టెక్నాలజీకల్‌ ఎడ్యుకేషనల్‌ ప్రాధ్యానం తెలియచేస్తుందన్నారు. ప్రొఫెసర్‌ ఎంకె శ్రీ మాలి మాట్లా డుతూ దేశం అభివద్ధి చెందాలి అన్న ఆయా రంగంలో సాంకేతిక పరిజ్ఞానం అభివద్ధి చెందాలి..అప్పుడు మాత్రమే కొత్త సమాజాన్ని మనం నిర్మాణం చేయగలమన్నారు. గుంతా లక్ష్మణ్‌ జీ మాట్లాడుతూ దేశములోని ఇంజినీరింగ్‌ కాలేజీలో పని చేస్తున్న అధ్యాపకులు అందరనీ ఒక వేదిక మీదకు తీసుకురావాలని తెలిపారు. ఇంజనీరింగ్‌ విద్యార్థు లకు మంచి భవిష్యత్తు ఇవ్వాల అన్నదే ఈ సెమినార్‌ యొక్క ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఈ కార్యక్రమంలో అనేక ఇంజినీరింగ్‌ కాలేజీలలో పని చేస్తున్న అధ్యాపకులు, ప్రిసిపాల్స్‌ దాదాపు 1000 మంది పాల్గొన్నారు.

Spread the love