భారత్‌కు ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..

నవతెలంగాణ – హైదరాబాద్ : పదకొండేళ్ల తర్వాత భారత్‌ ఖాతాలోకి ఐసీసీ ట్రోఫీ చేరింది. చివరిగా 2013లో ధోనీ నాయకత్వంలో ఛాంపియన్స్‌ ట్రోఫీని గెలుచుకుంది. అతడి సారథ్యంలోనే 2007 పొట్టి కప్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రోహిత్‌ కెప్టెన్‌గా 2024 టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024)లో విశ్వవిజేతగా భారత్‌ నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఏడు పరుగుల తేడాతో టీమ్‌ఇండియా గెలిచింది. విజేత భారత్‌కు, రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికాకు భారీ మొత్తంలోనే ప్రైజ్‌మనీ దక్కింది. సెమీస్‌లో నిష్క్రమించిన జట్లకూ ఐసీసీ ప్రైజ్‌మనీని అందించింది.
➥టీ20 WC 2024 ప్రైజ్‌మనీ: దాదాపుగా రూ.93.50 కోట్లు
➥టోర్నీ ఛాంపియన్‌ భారత్‌కు రూ.20.42 కోట్లు, రన్నరప్ SAకు రూ.10.67 కోట్లు
➥సెమీస్‌లో ఓడిన AFG, ENG జట్లకు చెరో రూ.6.56కోట్లు,
➥సూపర్ 8లో ఓడిన USA, WI, AUS, BAN టీమ్‌లకు రూ.3.17 కోట్ల చొప్పున
➥9 నుంచి 12వ ర్యాంకు టీమ్‌లకు రూ.2.5 కోట్లు
➥13 నుంచి 20వ ర్యాంకు జట్లకు రూ.1.87కోట్లు
➥➥గెలిచిన ఒక్కో మ్యాచ్‌కు రూ.26 లక్షలు అదనం

Spread the love