– ఇందిరమ్మ ఇల్లు – పేదల ఆత్మగౌరవానికి చిరునామా
నవతెలంగాణ – ఊరుకొండ
ఊరుకొండ మండల కేంద్రంతోపాటు పరిధిలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ గృహప్రవేశాలు ప్రజా ప్రతినిధులు, అధికారుల సమక్షంలో లబ్ధిదారుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాల కార్యక్రమంలో భాగంగా ఉరుకొండ మండల పరిధిలోని ముచ్చర్లపల్లి గ్రామంలో వీరెడ్డి శశికళకు చెందిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ వినీతధర్మేందర్ రెడ్డి, ఎంపీడీవో సత్యపాల్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయూబ్ పాషా, మాదారం మాజీ సర్పంచ్ ధ్యాప నిఖిల్ రెడ్డి, ముచ్చర్లపల్లి మాజీ సర్పంచ్ వీరెడ్డి పర్వత్ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షులు రమేష్ నాయక్, పంచాయతీ కార్యదర్శి బాలస్వామి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొని శశికళకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా పేదల సొంతింటి కల సాకారమవుతోందని, అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. పేదల అభ్యున్నతి, గ్రామీణాభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



