- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన బండి సరితా-సుధాకర్ దంపతులు పుత్రిక బండి ప్రతిష్టక సోమవారం విడుదలైన జెఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఆల్ డియాలో 213వ ర్యాంక్ సాధించి, ప్రతిభను చాటింది. ఆమె సాధించిన ప్రతిభ పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. మొదటి నుంచి ప్రతిష్ట చదువుపై శ్రద్ధ వహించి పదవ తరగతిలో మంచి మార్కులు సాధించి కరీంనగర్ లో ఓ ప్రయివేటు కళాశాలలో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే.
- Advertisement -



