– పాల్గొన్న వ్యవసాయ కళాశాల విద్యార్థులు
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జె. హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో ప్రథమ సంవత్సరం ఇద్దరు, ద్వితీయ సంవత్సరం ఆరుగురు విద్యార్థులు సోమవారం విజయవాడలో నిర్వహించిన “వికసిత్ భారత్ యంగ్ ప్రొఫెషనల్ రౌండ్ టేబుల్ – యంగ్ లీడర్స్ డైలాగ్ 2026” సమావేశంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో యువత నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్యంలో యువత పాత్ర, దేశాభివృద్ధిలో యువత బాధ్యతలు వంటి అంశాలపై చర్చలు జరిగాయి. పాల్గొన్న విద్యార్థులు వివిధ రంగాల నిపుణులతో పరస్పర చర్చలు నిర్వహించి తమ ఆలోచనలు, అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేయగా, వారి ప్రతిభను కళాశాల యాజమాన్యం అభినందించింది.
కార్యక్రమ సమన్వయ బాధ్యతలను ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు డి. స్రవంతి, డాక్టర్. ఝాన్సీ రాణి, డాక్టర్. శ్రీజన్ నిర్వహించారు. విద్యార్థులు ఇటువంటి జాతీయ స్థాయి వేదికల్లో పాల్గొనడం ద్వారా నాయకత్వ నైపుణ్యాలు, సామాజిక బాధ్యతలపై అవగాహన పెంపొందించుకునే అవకాశం లభిస్తుందని కళాశాల యాజమాన్యం పేర్కొంది.


