Thursday, August 27, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ఇందిరమ్మ  ఇండ్లు పేదలకు వరం సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్..

ఇందిరమ్మ  ఇండ్లు పేదలకు వరం సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్..

- Advertisement -

నవతెలంగాణ -ముధోల్ : కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు పేదలకు వరం లాంటిదని ఆష్ట సర్పంచ్  రావుల లావుణ్య శ్రీనివాస్ అన్నారు. ముధోల్ మండలంలోని ఆష్ట గ్రామంలో  ఇందిరమ్మ పధకం ద్వారా లబ్ధిదారులు తీగల పుష్ప  నిర్మించుకున్న ఇంటికి  గురువారం గృహ ప్రవేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన పేదింటి సొంతింటి కల ఇందిరమ్మ ఇండ్ల పథకం అన్నారు.  గ్రామంలో 21 ఇండ్లు మంజూరు కాగ ఇందులో ఇప్పటివరకు ఐదు ఇండ్లు పూర్తయి గృహప్రవేశం చేయడం జరిగిందని  అన్నారు. మిగతా ఇండ్లు కూడా వివిధ దశలో కొనసాగుతున్నాయని తెలిపారు.  ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని  సద్వినియోగం చేసుకోవాలని కోరారు . గ్రామంలో ఇంకెవరైనా మిగిలి ఉంటే అర్హులైన వారికి  జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి వేణుగోపాల చారి, మాజీ ఎమ్మెల్యే  నారాయణరావు పటేల్ సహకారంతో ఇళ్ళ మంజూరుకు కృషి చేస్తానన్నారు.ఈ సందర్భంగా గృహ ప్రవేశం కు హాజరైన సర్పంచ్ లావణ్య శ్రీనివాస్, ఉప సర్పంచ్ సావిత్ర కోటయ్య ను  సన్మానించి , వారికి ఇందిరమ్మ పధకం లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -