Sunday, September 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ లబ్దిదారుల ఎంపికలో అవకతవకలు

ఇందిరమ్మ లబ్దిదారుల ఎంపికలో అవకతవకలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం కొండంపేట గ్రామంలో ఇందిరమ్మ మొదటి విడత లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నాయకుడు ఏనుగు లక్ష్మీ నారాయణ,తోడే లక్ష్మన్,చిర్ల వినోద్,పోటు ఇరన్న,తోటపల్లి లడ్డు,జక్కు సాయి,దేవేందర్ లు ఆరోపిస్తున్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇంటింటా తిరిగి ఇల్లులేని నిరుపేద కుటుంబాలను ఎంపిక చేసి అధికారులకు సమర్పించిన నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలిపారు.కానీ నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్,పాలకవర్గం అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి అనాలోచనతో ఇందిరమ్మ మొదటి విడతలో మంజూరైన పేద లబ్ధిదారుల పేర్లను తొలగించి,మంజూరు కానీ తమకు అనుకూలంగా ఉన్న పేర్లను చేర్చడం జరిగిందని ఆరోపించారు. తక్షణమే కొత్తగా జాబితాలో చేర్చిన పేర్లను తొలగించి మంజూరైన వారికి న్యాయం చేయాలని కోరారు.లేదంటే ఉన్నతాధికారులకు పిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -