Thursday, April 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సిమెంట్ రోడ్డు పనుల పరిశీలన

సిమెంట్ రోడ్డు పనుల పరిశీలన

- Advertisement -
  • రూ.35 లక్షలతో అభివృద్ధి పనులు: సాయిజెన్ శేఖర్
  • నవతెలంగాణ – హైదరాబాద్/ నాచారం
    రాఘవేంద్ర నగర్‌లో పోచమ్మ గుడి నుండి అన్నపూర్ణ కాలనీకి వెళ్లే దారిలో రూ.35 లక్షల వ్యయంతో చేపట్టిన నూతన సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కాలనీవాసులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు.ప్రాంతంలో మౌలిక వసతులు మెరుగుపడుతున్నందుకు స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తూ, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మరియు మాజీ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా సాయిజెన్ శేఖర్ మాట్లాడుతూ, కార్పొరేటర్ పదవీకాలం చివర్లో ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో తీసుకొచ్చిన అభివృద్ధి పనుల శాంక్షన్లపై కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. “పనులు శాంక్షన్ కాలేదని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అలాంటి ప్రచారాలను నమ్మవద్దు” అని సూచించారు. మా హయాంలో శాంక్షన్ అయిన రూ.14 కోట్ల విలువైన పనులను దశలవారీగా పూర్తి చేస్తామని తెలిపారు. “కొబ్బరికాయలు కొట్టిన ప్రతి పని ఒక్కొక్కటిగా పూర్తి చేస్తాం” అని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో విఠల్ యాదవ్, మారయ్య, రాజబాబు, దేవులపల్లి యాదగిరి, నరేందర్ గౌడ్, మన్సూర్, గుజ్జ రాజు, అప్పు, పరశురాం, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -