జిల్లా సివిల్ సప్లయి డిటి తనిఖీ

– అనుమానస్పందతో రూం సీజ్
నవతెలంగాణ-ముత్తారం:
ముత్తారం మండలం సీతంపేట గ్రామంలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచారనే సమాచారం మేరకు జిల్లా సివిల్ సప్లయి అధికారి రవీందర్ ముత్తారం ఆర్ఐ రాజబాబుతో బుధవారం తనిఖీలు చేసేందుకు వెళ్లారు. దీంతో సదరు ఇంటి యాజమాని అందుబాటులో లేకపోవడం, రూంకు తాళం వేసి ఉండటంతో అధికారులు సదరు యాజమానికి ఫోన్ చేసిన అందుబాటులోకి రాకపోవ డంతో రూంను వారు సీజ్ చేశారు. యాజమాని అందుబాటులోకి వచ్చాక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు.
Spread the love