విత్తన దుకాణాల తనిఖీ 

నవతెలంగాణ – ఏర్గట్ల
ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్నందున ఏర్గట్ల ఎస్సై మచ్చెంధర్ రెడ్డి ఏఈఓ సాయి సచిన్ తో కలిసి మండలకేంద్రంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విత్తన డీలర్లు రైతులకు నాణ్యమైన విత్తనాలను,పురుగు మందులను అందివ్వాలని,విత్తనాలు కొన్న వెంటనే రైతుకు ఆ విత్తనాల యొక్క పూర్తి వివరాలతో కూడిన రశీదు ఇవ్వాలని అన్నారు.అలాగే డీలర్ ఎప్పటికప్పుడు స్టాక్ వివరాలు తెలిసేలా బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు.నకిలీ విత్తనాల వల్ల రైతు నష్టపోతే డీలర్ పై పీడియాక్ట్ నమోదు చేసి,లైసెన్స్ సైతం రద్దుచేస్తామన్నారు.
Spread the love