పార్టీ సభ్యత్వం ద్వారా కార్యకర్తలకు భీమా..

– కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్
– భీమా చెక్కు అందిస్తున్న చల్మెడ లక్ష్మీనరసింహరావు
నవతెలంగాణ – వేములవాడ
పార్టీ సభ్యత్వం ద్వారా కార్యకర్తలకు భీమా, చనిపోయిన కార్యకర్త కుటుంబానికి రెండు లక్షల రూపాయల పార్టీ భీమా చెక్కు కొండంత అండఅని చల్మెడ అన్నారు.
వేములవాడ అర్బన్ మండల సంకేపల్లి గ్రామానికి చెందిన కాచం ప్రభాకర్  గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ద్వారా మంజూరైన ఇన్సురెన్స్ చెక్కును  బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహరావు  కాచం ప్రభాకర్ కూతురైన అక్షిత కు అందజేశారు.  ఈ సందర్భంగా చల్మెడ మాట్లాడుతూ చనిపోయిన కార్యకర్త కుటుంబానికి పార్టీ ఇన్సురెన్స్ చెక్కు కొండ‌త భరోసా అన్నారు. పార్టీ కార్యకర్త చనిపోతే రెండు లక్షల రూపాయల భీమా అందిస్తున్న ఏకైక పార్టీ దేశంలో భారాస ఒక్కటే అన్నారు. ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు.  కార్యక్రమంలో  వైస్ ఎంపీపీ అర్ సి రావు,  సెస్ డైరెక్టర్ హరి చరణ్, ప్రధాన కార్యదర్శి సిలువేని మల్లేశం, మండల ఉపాధ్యక్షుడు కనకరాజు, నాయకులు బూర  బాబు, వేణు గోపాల్ రావు, నాగుల రాము, బండారి శ్రీనివాస్, మల్లేశం, పర్శరం, ఎల్లయ్య, శ్రీధర్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love