నియోజకవర్గ కేంద్రం అయిన అశ్వారావుపేటలో లే అవుట్ రెగ్యులేటర్ స్కీం పరిధిలోని ఖాలీ స్థలాల సర్వేను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు.ఈ స్కీం విభాగంలో 2020 ఆగస్ట్ లో అశ్వారావుపేట పంచాయితీ పరిధిలో 1622, పేరాయిగూడెం పరిధిలో 696 దరఖాస్తులు అందాయి. వాటిని నేడు పంచాయితీ కార్యదర్శి కోటమర్తి శ్రీరాం మూర్తి తన సిబ్బందితో క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నారు. భూమి స్వాధీనంలోని యజమాని దగ్గర ఉన్న ఈ.సీ,లింక్ డాక్యుమెంట్,సైట్ సరిహద్దులను పరిశీలిస్తున్నారు. అనంతరం నివేదికను ఉన్నతాధికారులను అందజేస్తామని అన్నారు.