ఓటు హక్కు ఆవశ్యకతపై కరపత్రాల ఆవిష్కరణ

నవతెలంగాణ – ఆర్మూర్ 

రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ఓటు ఒక వజ్రాయుధం  కరపత్రాలను శుక్రవారం డిస్ట్రిక్ట్  ఇమ్యునేజేషన్ ఆఫీసర్ డాక్టర్ అశోక్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ మే 13న జరిగే పార్లమెంటరీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని , 85 వయసు దాటిన వయోవృద్ధులు ఇంటి వద్ద నుంచే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని ఎలక్షన్ కమిషన్ కల్పిస్తుందని ఆయన తెలిపారు. రోటరీ సేవలు స్ఫూర్తిదాయకయం సందర్భంగా రోటరీ కార్యవర్గాన్ని వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు గోపి కృష్ణ పట్వారి ,పుష్పాకర్ రావు, తులసి తదితరులు పాల్గొన్నారు.

Spread the love