నవతెలంగాణ-హైదరాబాద్ : ఇసుజు మోటార్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ, భారతదేశంలోని ప్రముఖ వాణిజ్య వాహన ఎగుమతిదారులలో ఒకటైన ఇసుజు మోటార్స్ ఇండియా, ఇసుజు డి-మ్యాక్స్ ఎస్-క్యాబ్ కోసం ఒక కొత్త లీజింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఈ రోజు ప్రకటించింది. భారతదేశంలోని వివిధ వ్యాపారాలకు వాహన లీజింగ్ ఒక ప్రాధాన్య ఎంపికగా క్రమంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో భారం లేకుండా వాణిజ్య వాహనాలు పొందేందుకు వినియోగదారులకు మరింత తెలివైన, సౌకర్యవంతమైన మార్గాన్ని అందించడం ఈ కొత్త యాజమాన్య విధాన లక్ష్యం. వివిధ వ్యాపార అవసరాలు, మన్నిక, విశ్వసనీయత, పనితీరు, వైవిధ్యానికి విస్తృత గుర్తింపు పొందిన ఇసుజు డి-మ్యాక్స్ ఎస్-క్యాబ్ వాహనంపై ప్రత్యేక దృష్టితో ఈ పథకం రూపొందించడం జరిగింది.
ఈ లీజింగ్ విధానం అధిక కార్యాచరణ సౌలభ్యం, ఆర్థిక సామర్థ్యాన్ని అందించేలా రూపొందించబడింది. ఇది అధిక ముందస్తు మూలధన పెట్టుబడి, తరుగుదల లేదా పునః విక్రయ అనిశ్చితులకు సంబంధించిన చికాకులు తొలగిస్తూ, వ్యాపారాలు, ఫ్లీట్ ఆపరేటర్లు వాహనాన్ని ఒక నిర్ణీత కాలంపాటు ఉపయోగించుకోవడానికి వీలు కల్పిస్తుంది.
ఈ పథకం వినియోగదారులకు అవాంతరాలు లేని మొబిలిటీ పరిష్కారాన్ని అందించడంతో పాటు, వారి నగదు ప్రవాహాన్ని ఆప్టిమైజ్ చేయడానికి, ఊహించదగిన నిర్వహణ ఖర్చులు కొనసాగించడానికి, ఆధునిక, విశ్వసనీయమైన, నిబంధనలకు అనుగుణమైన ఫ్లీట్‌ను నిర్వహించడానికి సహాయపడటం లక్ష్యంగా పెట్టుకుంది. లీజింగ్ పథకపు ముఖ్యాంశాలు*:
- ఆకర్షణీయమైన నెలవారీ అద్దె రూ.38,999/-
- 4 సంవత్సరాల స్థిర కాలపరిమితి
- జీరో డౌన్ పేమెంట్
- అదనపు సర్వీస్ ఖర్చులు లేవు
- ఇన్సూరెన్స్ లేదా రిజిస్ట్రేషన్ ఖర్చులు లేవు
- సాంప్రదాయ ఫైనాన్సింగ్ పద్ధతుల కంటే గణనీయమైన ఆదా
(*నియమ నిబంధనలు వర్తిస్తాయి)
సాంప్రదాయ ఫైనాన్షియల్ విధానానికి బదులుగా లీజింగ్ పద్ధతి ఎంచుకోవడం ద్వారా వినియోగదారులు రూ.1.81 లక్షల వరకు ఆదా చేసుకోగలుగుతారు. ఇది వ్యాపార నిర్వహణ భారాన్ని తగ్గించుకునేందుకు, మూలధన పరిమితులు లేకుండా కార్యకలాపాలు విస్తరించడానికి, వాహనాలు వేగంగా వినియోగించడానికి, కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడానికి, మరింత ఆత్మవిశ్వాసంతో పురోగమించడానికి వీలు కల్పిస్తుంది.
ఈ సందర్భంగా ఇసుజు మోటార్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రాజేష్ మిత్తల్ మాట్లాడుతూ, “అంతర్జాతీయంగా విభిన్న మార్కెట్లలోని వ్యాపారాలకు తోడ్పాటు అందించే నమ్మకమైన, మన్నికైన, సమర్థవంతమైన వాణిజ్య వాహనాలు అందించడంలో ఇసుజు ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఖ్యాతి సంపాదించుకుంది. ఒక విశ్వసనీయమైన గ్లోబల్ బ్రాండ్‌గా మాకు అత్యంత ముఖ్యమైన మార్కెట్‌గా ఉన్న భారతదేశంలో మేము మా ఉనికిని మరింత బలోపేతం చేసుకుంటున్నాము. లీజింగ్ ఆప్షన్ ప్రవేశపెట్టడం ద్వారా జపనీస్ నాణ్యత, మన్నికకు పేరుగాంచిన ఇసుజు వాణిజ్య వాహనాలు మరింత అందుబాటులోకి తెచ్చి పారిశ్రామికవేత్తలను ఆర్థికంగా సమర్థవంతంగా నిలబెట్టాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము” అన్నారు.
ఇసుజు మోటార్స్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ టకేషి హిరానో మాట్లాడుతూ, “వినియోగదారులకు వాణిజ్య వాహన యాజమాన్యాన్ని మరింత సులభతరం చేయడానికి రూపొందించిన ఇసుజు డి-మ్యాక్స్ ఎస్-క్యాబ్ లీజింగ్ మోడల్ పరిచయం చేస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. ఇసుజు డి-మ్యాక్స్ ఎస్-క్యాబ్ ఉన్నతమైన నిర్మాణ నాణ్యత, విశ్వసనీయతతో వాణిజ్య వాహన రంగంలో ఒక నమ్మకమైన వాహనంగా నిరూపించుకుంది. ఇది వివిధ రకాల అవసరాలకు ఉపయోగపడుతూ పెద్ద వ్యాపారాలు, ఫ్లీట్ ఆపరేటర్ల విజయంలో కీలక సాధనంగా నిలుస్తోంది. ఈ కొత్త లీజింగ్ ప్రతిపాదనతో మా వినియోగదారులు విశ్వసనీయమైన ఎస్-క్యాబ్‌ను పొందేందుకు మరింత తెలివైన, సరళమైన, అవాంతరాలు లేని విధానాన్ని పరిచయం చేస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. యాజమాన్యం, ముందస్తు పెట్టుబడికి సంబంధించిన సాంప్రదాయ అడ్డంకులు తొలగించడం ద్వారా ఈ పథకం వ్యాపారులు మొదటి రోజు నుంచే అధిక ఆర్థిక సామర్థ్యం, కార్యాచరణ సౌలభ్యంతో తమ వ్యాపార సామర్థ్యాన్ని స్వీకరించే వీలు కల్పిస్తుంది” అన్నారు.
ఇసుజు డి-మ్యాక్స్ ఎస్-క్యాబ్ నిరూపితమైన 2.5L VGT ఇంటర్‌కూల్డ్ డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. అధునాతన 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో బలమైన పనితీరు, సామర్థ్యాన్ని అందిస్తుంది. దీని ఏరోడైనమిక్ డిజైన్, అధిక-బలం గల స్టీల్ బాడీ, పెద్ద కార్గో బెడ్, మన్నికైన సస్పెన్షన్, మెరుగైన లోడ్ మోసే సామర్థ్యం కలిగి ఉంది. లోపల వైపు ఇది 6-విధాలుగా అడ్జస్ట్ చేసుకోగల డ్రైవర్ సీటు, మెరుగైన వెనుక సీటు, దుమ్ము, పుప్పొడి ఫిల్టర్‌తో కూడిన ఏసీ, బహుళ స్టోరేజ్ స్థలాలు, మెరుగైన సౌలభ్యం కోసం మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లేతో కూడిన సౌకర్యవంతమైన క్యాబిన్ కలిగి ఉంది.
ఈ పథకం తమ వినియోగదారులకు వ్యాపార సామర్థ్యం, దీర్ఘకాలిక విలువ సృష్టించాలనే ఇసుజు నిబద్ధతను బలపరుస్తుంది. యాజమాన్య అడ్డంకులు తగ్గించడం, ఆర్థిక సౌలభ్యాన్ని పెంచడం ద్వారా ఈ లీజింగ్ విధానం వినియోగదారులు తమ కార్యకలాపాలు సజావుగా విస్తరించుకోవడానికి, వ్యాపార వృద్ధిపై దృష్టి పెట్టడానికి వెసులుబాటు కల్పిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయమైన ఇసుజు ఉత్పత్తుల తోడ్పాటుతో ఈ పథకం వినియోగదారులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడానికి, వారి వృద్ధి ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి వీలు కల్పిస్తుంది.
ఆసక్తి ఉన్న వినియోగదారులు మరిన్ని వివరాల కోసం సమీపంలోని ఇసుజు డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు.



