పట్టపగలే లైట్లు వెలుగుతున్నా.. పట్టింపు లేదా..?

– మండలంలో పలు గ్రామాల్లో రాత్రింబవళ్ళు వెలుగుతున్న వీధి దీపాలు
– వందలాది యూనిట్ల కరెంటు వృధా
నవతెలంగాణ – పెద్దవూర
మండలం లోని ఏ గ్రామంలో వీధి దీపాలు పగలు, రాత్రి అనే తేడా లేకుండా వెలుగుతున్న గ్రామ పంచాయితీ సిబ్బంది పర్యవేక్షణ లోపం తో వారి నిర్లక్ష్యాన్ని  ఎత్తిచూపిస్తున్నాయి.మండలం లో 26 పంచాయతీ లలో 24 అవాస గ్రామాలు కలువు కోని మొత్తం 50 గ్రామాలు న్నాయి. అందులో 30 కి పైగా అవాస గ్రామాల్లో వీధి లైట్లు గత రెండేళ్లుగా వెలుగుతూనే వున్నాయి.దీంతో విలువైన విద్యుత్ వృధా అవుతుందన్న విమర్శలు మండలం వెల్లువెత్తుతున్నాయి. వీధి దీపాల నిర్వహణలో ఉన్న సమస్యలను గ్రామపంచాయతీ సిబ్బంది, పాలకవర్గం పట్టించుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. మండలం లోని కొన్ని గ్రామాలలో కొన్ని స్తంభాల వద్ద అసలే రాత్రిపూట వీధిలైట్లు వెలగడం లేదని. ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తుంటే కొన్ని స్తంభాల వద్ద పగలు రాత్రి తేడా లేకుండా వృధాగా  వీధి దీపాలు వెలుగుతున్నాయి.గ్రామాల్లో  నిరంతరం వెలుగుతూన్న విధి దీపాలను అర్పేది ఎవరీ బాధ్యత అని ప్రశ్నిస్తున్నారు.  పగలు రాత్రి తేడా లేకుండా వెలుగు తుండంతో వందలాది యూనిట్ల విద్యుత్ వృధా అవుతుంది. ప్రభుత్వం నిరంతరం విద్యుత్ని  అందించడానికి వేలకోట్లు వెచ్చిస్తున్న.. విద్యుత్తును ఆదా చేయాల్సిన సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా కొన్ని గ్రామాల్లో అఫ్ ఆన్ స్విచ్ లు ఏర్పాటు చేసిన వాటిని ఆర్పే వారు లేరు. కొన్ని గ్రామాల్లోకి ఆఫ్ ఆన్ స్విచ్ లు లేవు దింతో పగలు, రాత్రి, వెలుగుతూనే వున్నాయి. దింతో గ్రామ పంచాయతీలకు వేల రూపాయల బిల్లులు వస్తున్నాయి. మండలం లోని నాయిన వాణికుంట, నాయినవాని కుంట తండా, లో రాత్రి పగలు తేడా లేకుండా వెలుగుతూనే వున్నాయి. అధికారులు స్పందించి గ్రామాల్లో వీధిలైట్లకు ఆఫ్ ఆన్ స్విచ్ లు ఏర్పాటు చేసి ప్రతి నిత్యం ఉదయం అర్పేలా చూడాలని మండలకోరుతున్నారు.
Spread the love